పోలీసుల అదుపులో మావోయిస్టు కమాండర్‌ ‌బార్సే దేవా 

– మరో 15 మంది మావోయిస్టులు కూడా
– డీజిపి ఎదుట రేపు ప్రవేశపెట్టే అవకాశం
– హిడ్మా ఎన్‌కౌంటర్‌ ‌తరువాత బాధ్యతలు  తీసుకున్న బార్సే దేవా
– ఇతనిపై రూ.50 లక్షల రివార్డు ప్రకటించిన ప్రభుత్వం

భద్రాచలం,ప్రజాతంత్ర,జనవరి 02 : మావోయిస్టుల ఉద్యమంలో కీలక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.అనేక మంది వివిధ క్యాడర్‌లో ఉన్న నేతలు నేలకు ఒరిగారు. ఇప్పటికే జరిగిన ఎన్‌ ‌కౌంటర్లలో పలువురు కీలక మావోయిస్టు అగ్రనేతలు మరణించారు. మరికొందరు పోలీసులు ముందు లొంగిపోయారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌ ‌లో మావోయిస్టు ముఖ్య నేత హిడ్మా చనిపోయిన సంగతి తెలిసిందే.ఇప్పుడు మరో అగ్రనేత,మావోయిస్టు కమాండర్‌ ‌బార్సే దేవా అలియాస్‌  ‌పోలీసులకు పట్టుపడినట్లు తెలుస్తుంది. అతడిపై రూ.50 లక్షల రివార్డు కూడా ఉంది. డిజిపి ఎదుట శనివారం దేవా లొంగుబాటును మీడియాకు చూపించనున్నట్లు తెలుస్తుంది. మావోయిస్టు సంస్థలో బెటాలియన్‌-1 ‌కమాండర్‌గా పనిచేస్తున్న బార్సే దేవాను ములుగు జిల్లా బయ్యక్కపేట సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌ ‌తరువాత అతని స్థానంలో బార్సే దేవా బాధ్యతలు తీసుకున్నాడు. రెండు రోజుల క్రితమే ములుగు- భూపాలపల్లి సరిహద్దు అటవీ ప్రాంతంలో దేవాను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవాతోపాటు మరో 15 మంది మావోలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారిని శనివారం నాడు  మీడియా ముందు ప్రవేపెట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం.దేవా స్వగ్రామం ఛత్తీస్‌గఢ్‌లోని పువర్తి గ్రామం. మిలిటరీ శిక్షణలో ఆరితేరిన దేవా, బెటాలియాన్‌ 1‌కు 2017లో బాధ్యతలు చేపట్టాడు. గతంలో హిడ్మాతో కలిసి పని చేసిన అనుభవం బార్సే దేవాకు ఉంది. .దండకారణ్యంలో మావోయిస్టు పార్టీని దూకుడుగా నడిపించిన టాప్‌ ‌కమాండర్‌ ‌మడావిహిడ్మా మరణం తర్వాత ఆ స్థానం కోసం అన్వేషణ సాగింది. చివరకు హిడ్మాకు సహచరుడు, ఆయన గ్రామం పువర్తికే చెందిన బార్సెదేవాను ఆ స్థానంలో నియమితులయ్యాడు. సుక్మా జిల్లాలోని పువార్తి గ్రామానికి చెందిన బర్సా దేవా, ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన హిద్మాతో కలిసి సుమారు ఒకటిన్నర దశాబ్దాల పాటు పనిచేశాడు.తాజాగా బార్సెదేవను సైతం తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బార్సే దేవా స్వగ్రామం ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని ఓయూ పారా ప్రాంతం. చిన్న వయసులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరిన దేవా, క్రమంగా మిలిటరీ శిక్షణలో ఆరితేరాడు. అడవుల్లో యుద్ధ నైపుణ్యాలు, ఆయుధాల వినియోగంలో ప్రత్యేక నైపుణ్యం సాధించిన అతడిని 2022లో బెటాలియన్‌-1 ‌కమాండర్‌గా నియమించారు. అప్పటి నుంచి తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ ‌సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన పలు మావోయిస్టు దాడుల్లో దేవా కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. హిద్మా ఎన్‌కౌంటర్‌ ‌తర్వాత స్క్వాడ్‌ ‌కమాండర్లు, పార్టీ ఏరియా కమిటీ సభ్యులు, స్క్వాడ్‌ ‌సభ్యులు, మిలీషియా గందరగోళానికి గురయ్యారని, లొంగిపోవడమే ఉత్తమ మార్గమని వారు భావించారని ఛత్తీస్‌గఢ్‌ ‌పోలీసులు చెబుతున్నారు.
దేవాను కోర్టులో హారుపర్చాలి 
మరోవైపు మావోయిస్టు కమాండర్‌ ‌బార్సే దేవా మరో 15 మంది మావోయిస్టులను వెంటనే కోర్టులో హాజరు పరచాలని ఫొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. అరెస్ట్ ‌చేసి రెండురోజులు గడుస్తున్నా, వారిని కోర్టులో హాజరు పరచకపోవడం అప్రజాస్వామికమేనన్నారు. చట్టప్రకారం రాజ్యాంగబద్ధంగా కోర్టులో హాజరు పరచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
——————————————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *