మావోయిస్టు కార్యకర్త నార్ల శ్రీవిద్య అపహరణ

– వెంటనే ఆమెను కోర్టులో ప్రవేశపెట్టాలి
– మానవ హక్కుల వేదిక

i
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24: సీపీఐ(మావోయిస్టు) కార్యకర్త నార్ల శ్రీవిద్య(52)ను (నార్ల సుధాకర్‌శర్మ కుమార్తె) హైదరాబాని హఫీజ్‌పేట్‌ నుండి సాయుధ వ్యక్తులు అపహరించినట్టు ఆమె కుటుంబ సభ్యులు తమ సంస్థకు సమాచారం ఇచ్చారని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.తిరుపతయ్య, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు ఎస్‌.జీవన్‌ కుమార్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆమెను అపహరించిన వాళ్ళు మప్టీలో ఉన్న పోలీసులా లేక ప్రైవేట్‌ వ్యక్తులా అనేది తెలియదని శ్రీవిద్య మావోయిస్టు పార్టీ సభ్యురాలైనందున ఆమెకు హాని జరిగే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెను తీసుకెళ్లిన వారు పోలీసులైతే చట్ట ప్రకారం కోర్టులో ప్రవేశపెట్టాలని, పోలీసులు కాకుంటే పోలీసులు ఆమెను వెతికి ఆమెపై కేసులు ఏమైనా ఉంటే చట్ట ప్రకారం వ్యవహరించాలని మానవహక్కుల వేదిక నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *