తెలంగాణ విమోచనాన్ని ప్రస్తావించిన ప్రధాని

– స్వచ్ఛ భారత్‌ ప్రాముఖ్యతను మరోమారు గుర్తు చేశారు
– బోరబండలో మన్‌ కీ బాత్‌ వీక్షించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: స్వచ్ఛ భారత్‌ కార్యక్రమ ప్రాముఖ్యతను నేటి మన్‌ కీ బాత్‌లో ప్రధాని మరోసారి గుర్తుచేశారని. బస్తీలు, నగరాలు, దేశం పరిశుభ్రంగా ఉండాలని, పరిశుభ్రతతోనే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెప్పారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బోరబండ డివిజన్‌లో స్థానిక ప్రజలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని థెలంగాణ విమోచనం గురించి ప్రస్తావించారన్నారు. భారత స్వాతంత్య్రం అనంతరం 13 నెలల తర్వాత సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జోక్యంతో పోలీస్‌ యాక్షన్‌ నిర్వహించారని, నిజాం సైన్యాన్ని, రజకాకార్లను ఓడిరచి హైదరాబాద్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని ప్రధాని పేర్కొన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో విలీనం కావడానికి సర్దార్‌ పటేల్‌ చేసిన కృషిని మోదీ మన్‌ కీ బాత్‌లో ప్రస్తావించారున్నారు. సెప్టెంబర్‌ 17న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో హైదరాబాద్‌ లిబరేషన్‌ డే ఘనంగా నిర్వహించనునామని కిషన్‌రెడ్డి చెప్పారు. ఆ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరవుతారన్నారు. అలాగే విశ్వకర్మ దివస్‌ను కూడా జాతీయ కార్మిక దినోత్సవంగా నిర్వహిస్తామన్నారు. అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు కూడా కావడంతో తెలంగాణలో మూడు ముఖ్యమైన కార్యక్రమాలను ఒకే రోజున నిర్వహించనున్నట్లు తెలిపారు. తన కుమారుడు దేశానికి ప్రధాని అయినా ఆయన తల్లి మాత్రం సాధారణ గదిలో చిన్న మంచం, చిన్న వంట గదితోనే సాధారణ జీవనం కొనసాగించారన్నారు. ఇంత గొప్ప ప్రధానమంత్రి తల్లి రెండేళ్ల క్రితం మరణించారని తెలిసినా కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీతోపాటు వారి అనుచరులు బీహార్‌లో మోదీ తల్లి గురించి నీచంగా, మానవత్వం లేకుండా మాట్లాడారన్నారు. అలాంటి దుర్మార్గపు నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *