సృజనాత్మకత మనిషి మనుగడకు మూలాధారం

– ‘మానేరు తీరం’ ఆవిష్కరణలో డాక్టర్ రఘురాం

కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 30: ఎన్ని కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఎదురైనా మనిషి మనుగడను సృజనాత్మకతే నిలబెడుతుందని ప్రముఖ వైద్యుడు దారం రఘురాం అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ తెలుగులో రచించి తానే స్వయంగా ఆంగ్లంలోకి అనువదించిన మానేరు తీరం ద్విభాషా కవితా సంకలనాన్ని ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానేరు తీరం కవితలు సౌందర్యాన్ని అలంకరించవు.. సత్యాన్ని ఆవిష్కరిస్తాయి. వాటిలో ఆశ ఉంది, కానీ అది బతుకు ఆరాటం పోరాటం మధ్యలో పుట్టిన ఆశ అని అన్నారు. తెలుగు-ఇంగ్లీష్ ద్విభాషా పుస్తకంగా వచ్చిన ఈ ‘మానేరు తీరం’ ఒక భాషకు మాత్రమే చెందినది కాదు.. ప్రతి మనిషికి చెందినదే అన్నారు. కరీంనగర్ పట్టణ కంఠాభరణం అయిన మానేరు నది ఒడ్డున దిగువ మానేరు ఆనకట్టపై జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా హాజరైన డాక్టర్ వుడుత చంద్రశేఖర్ మాట్లాడుతూ సృజనాత్మకతలో ఆనంద్ యాదొంకి బారాత్‌ని విశ్లేషించారు. సీనియర్ జర్నలిస్టు రావికంటి శ్రీనివాస్ మాట్లాడుతూ నిరంతర సాహితీ కృషి ఆనంద్‌ని నిలబెడుతున్నదన్నారు. కె.ఎస్. అనంతాచార్య మాట్లాడుతూ మానేరు తీరం పుస్తకావిష్కరణ మానేరు ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగడం స్పూర్తిదాయకంగా ఉందన్నారు. సీనియర్ జర్నలిస్ట్ పి.ఎస్.రవీంద్ర మాట్లాడుతూ తమ ఫిల్మ్ సొసైటీ ప్రయాణాన్ని గురించి వివరించారు. కవి వారాల ఆనంద్ మాట్లాడుతూ తన సాహితీ ప్రయాణాన్ని క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు గాజుల రవీందర్, సంకేపల్లి నాగేంద్ర శర్మ, మెట్టు సుగేందర్, శ్రీపతి, పొయెట్రీ ఫోరం నిర్వాహకులు ఇందిరారాణి, చందన తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *