– ఆకాంక్షించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమత
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు తనను ఆహ్వానించినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఎం రేవంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మమతా బెనర్జీని గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు అప్పగించారు. దీంతో మమతా బెనర్జీని సంప్రదించేందుకు సీతక్క ప్రయత్నించగా జిల్లాల్లో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో వ్యక్తిగతంగా కలవడం కష్టమని, ఆమె ఆదేశాల మేరకు ఆహ్వాన పత్రాన్ని ఇ-మెయిల్ ద్వారా పంపించాలని మమతా బెనర్జీ కార్యాలయం సూచించింది. అందుకనుగుణంగా మంత్రి సీతక్క గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ఇ-మెయిల్ ద్వారా పంపారు. ఆహ్వాన పత్రిక అందుకున్న అనంతరం మమతా బెనర్జీ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ లేఖ పంపారు. తెలంగాణ ఆహ్వానం అందుకోవడం ఎంతో గౌరవప్రదమైనదని, అయితే గ్లోబల్ సమ్మిట్ జరిగే తేదీల్లో తనకు ముందుగానే నిర్ణయించిన పర్యటనలు ఉండటం వల్ల హాజరుకాలేకపోతున్నట్లు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ సార్థక చర్చలకు వేదికగా నిలిచి రాష్ట్ర ఆర్థిక పురోగతికి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశంగా మారాలని ఆకాంక్షించారు. సమ్మిట్ ఘన విజయం సాధించాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




