లొంగుబాటు దిశగా మావోయిస్టు అగ్రనేత మల్లోజుల? 

– ఆయ‌న బాట‌లోనే త‌క్కెళ్ల‌ప‌ల్లి వాసుదేవ‌రావు?
– మావోయిస్టు ఉద్య‌మానికి మ‌రో పెద్ద కుదుపు
– ప్ర‌జాస్వామ్య పోరాటం దిశ‌గా ఉద్య‌మం?

జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: భారత మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒకప్పుడు అత్యంత మేధావిగా, ఆలోచనా ప‌రుడిగా పేరుపొందిన మల్లోజుల వేణుగోపాల్ రావు (అలియాస్ అభ య్, సోనూ, భూపతి, మాస్టర్), అతనితో పా టు మరో కేంద్రకమిటీ సభ్యుడు త‌క్కెళ్ల‌పల్లి వాసుదేవరావు (ఆశన్న) కూడా లొంగుబాటు వైపు అడుగులు వేస్తున్నారని ఊహాగానాలు జో రుగా వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే మావో యిస్టు ఉద్యమానికి ఇది భారీ కుదుపు వంటిదే. ఎందుకంటే వీరిద్దరూ పార్టీ లోపల సిద్ధాంతపరులుగా, వ్యూహకర్తలుగా ఉన్నారు. వీరిద్ద‌రు లొంగిపోతార‌ని ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.  భారత మావోయిస్టు ఉద్యమ చరి త్రలో ఒకప్పుడు అత్యంత మేధావిగా, ఆలోచనా ప‌రుడిగా పేరుపొందిన మల్లోజుల వేణుగో పాల్ రావు ఇప్పుడు సాయుధ పోరాటం వ‌ద‌లి ప్ర‌జాస్వామిక పోరాట పంథాను అనుస‌రిం చాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ప్రాంతంలో పేద కుటుంబంలో పుట్టిన వేణుగోపాల్, స్వా తంత్య్ర‌ సమరయోధుల వారసత్వం కలిగినవా డు. తండ్రి వెంకటయ్య, తల్లి మధురమ్మ ఇద్దరు ఆలోచనాపరులే. పెద్ద అన్నయ్య మల్లో జుల కోటేశ్వరరావు (కిషన్‌జీ) పార్టీకి ప్రధాన సైనిక వ్యూహకర్తగా పనిచేస్తూ 2011లో ఎన్‌ కౌంట ర్‌లో హతమయ్యాడు. ఈ సంఘటన వేణుగో పాల్ లో లోతైన ఆలోచనలకు దారితీసిందని చెబుతారు.  మావోయిస్టు కేంద్రకమిటీలో, పాలిట్‌బ్యూరోలో ప్రధాన వ్యూహకర్తగా, ప్రచా ర విభాగాధిపతిగా, దండకారణ్య ప్రత్యేక జోన ల్ కమిటీకి నాయకుడిగా వేణుగోపాల్ అనేక కీలక భాద్యతలు నిర్వర్తించాడు. 2010 దంతే వాడ దాడి (76 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణం) వెనుక అతని పాత్ర ఉందని ఇంటెలి జెన్స్ వర్గాలు అనుమానించాయి. అదే సమ యం లో లాల్‌గ‌ఢ్‌ ఉద్యమంలో ప్రజల మద్దతు గెలుచుకోవడంలో అతను ముందుండేవాడు. కానీ 2022 తర్వాత పరిస్థితులు మారాయి. నిరంతర ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు, కేంద్ర హోం శాఖ కఠిన వైఖరి, రాష్ట్రాల సమన్వయం ఇవన్నీ మావోయిస్టు శక్తిని గణనీయంగా బలహీనపరిచాయి. ఫలితంగా పార్టీ లోపలే సా యుధ పోరాటం కొనసాగించాలా? లేక ప్రజా స్వామిక ఉద్యమాలకు మారాలా? అన్న విభేదాలు రేకెత్తాయి. ఈ రెండో ఆలోచ నకు వేణుగో పాల్ నాయకత్వం వహించా డని చెబుతున్నారు. ఇటీవల మల్లోజుల వేణుగోపాల్ ప్రభుత్వా నికి పంపిన లేఖ చర్చనీయాంశమైంది. అందులో “తుపా కీతో పోరాటానికి ఇప్పుడు అర్ధం లేదు… ప్రజాస్వామిక పద్ధతుల్లో మార్పులు సాధిం చవచ్చు” అని ఆయన పేర్కొన్నట్టు విశ్వ సనీయ వర్గాలు తెలిపాయి. అలాగే, మావో యిస్టు శాంతి చర్చలు, గతంలో కిష న్‌జీ చనిపోయే ముందు కేంద్రంతో జరగా ల్సిన చర్చల విఫలయత్నాలను గుర్తుచేసి, “అప్ప టి తప్పిదాలను పునరావృతం చేయ కూడదు” అన్న సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది.
కేంద్ర హోం  మంత్రి అమిత్‌ షా గతంలో “2026 నాటికి మావోయిస్టు ముప్పును పూ ర్తిగా అంతం చేస్తాం” అని ప్రకటించా రు. ఇప్పుడు అగ్రనేతలే తుపాకులు దించు కుని లొంగబాటు వైపు అడుగులు వేస్తే అది ప్రభు త్వానికి విజయంగా నిలుస్తుంది. కానీ మరో వైపు ఇది ఉద్యమంలోని మిగిలిన కేడర్‌ను అతివాద దిశగా నెడుతుందా? లేక శాంతి మార్గం వైపు మలుస్తుందా? అన్నది గమనించాల్సిన అంశం. మావోయిస్టు ఉద్యమం నాలుగు దశాబ్దాలుగా అడవుల్లో సాగినా, ఇప్పటి పరిణామాలు అది చరిత్రాత్మక మ‌లుపు తీసుకునే అవ‌కాశ‌ముందన్న అభిప్రా యాన్ని క‌లిగిస్తున్నాయి. మావోయిస్టు సిద్ధాం త నేత మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోతే అది స‌రికొత్త మార్పున‌కు నాంది కాగ‌ల‌దు. అయితే ఉద్యమం ఇంకా పూర్తిగా అంతం కాలేదు.  మల్లోజుల వేణుగోపాల్ లాంటి అ గ్రనేతల లొంగుబాటు మావోయిస్టు ఉద్యమా నికి కేవలం వెనుకడుగు మాత్రమే కాదు.. అది మారిన మావోయిస్టుల వైఖరికి నిదర్శనమని పలువురు భావిస్తున్నారు. సాయుధ పోరాటం కన్నా ప్రజాస్వామిక మార్గాల్లో మార్పు సాధ్యమని వారు గుర్తించటం, కొత్త భవిష్యత్తుకు పునాది కావచ్చు. కానీ ఇది కేవలం లొంగుబాటుతో ముగియదు. సమా జంలో అసమానతలు, పీడన, అన్యాయం ఉన్నంతకాలం, ఉద్యమం మరో రూపంలో మళ్లీ తలెత్తే అవకాశం ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *