– హాస్పిటల్‌లో చేరిక.. నిలకడగా ఆరోగ్యం
బెంగళూరు, అక్టోబర్ 1: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే స్వల్ప అస్వస్థతతో బెంగళూరులోని ఎంఎస్ రామయ్య హాస్పిటల్‌లో బుధవారం చేరారు. ఆయన గుండెకు పేస్‌మేకర్ అమర్చాలని వైద్యులు సూచించారని ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే వెల్లడిరచారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తెలిపారు. ఖర్గేకు జ్వరం, కాలు నొప్పి కారణంగా మంగళవారం హాస్పిటల్‌లో చేర్చాం.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, ఆందోళన చెందాల్సిన పని లేదు.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు అని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. ఖర్గే ఇటీవల పాట్నాలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్నారు. మంగళవారం బెంగళూరులో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు ఉత్తర కర్ణాటకలో భారీ వరదలు, పంట నష్టం బాధితులను ఆదుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర సాయానికి లేఖ రాస్తానని కూడా చెప్పారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఖర్గేను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పరామర్శించారు. గురువారం ఆయన హాస్పిటల్ నుంచి డిశ్ఛార్జ్ అయ్యే అవకాశం ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




