మల్లెపల్లికి సి.సుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం

న్యూ దిల్లీ, ఫిబ్ర‌వ‌రి 17 : ప్రముఖ సామాజికవేత్త, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్  ఛైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య ప్రతిష్టాత్మకమైన సి.సుబ్రహ్మణ్యం అవార్డ్ ఫర్ కమ్యూనిటీ లీడర్‌షిప్ 2025–26 పురస్కారానికి ఎంపికయ్యారు. సోమవారం (ఫిబ్రవరి 16) న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ‘నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా’  ప్రతినిధులు ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. సామాజిక న్యాయం, అణగారిన వర్గాల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకులను గుర్తించి, భారతరత్న సి. సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం  ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ ఛైర్మన్ రష్మీ సింగ్ , రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సత్యానందన్ మిశ్రా, ఎన్ ఎఫ్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విరాజ్ పట్నాయక్, ప్రాజెక్ట్ డైరెక్టర్ సమీరా, నేషనల్ క్యాంపెయిన్ ఫర్ దళిత్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధి పాల్ దివాకర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా దళిత, గిరిజన సమస్యలపై మల్లెపల్లి లక్ష్మయ్య చేస్తున్న పోరాటం, సామాజిక సమానత్వం కోసం ఆయన రాస్తున్న విశ్లేషణాత్మక వ్యాసాలను ఈ సందర్భంగా కొనియాడారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సబ్-ప్లాన్: తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ సబ్-ప్లాన్ సమర్థవంతంగా అమలు కావడానికి, తగిన బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చూడటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సిడిఎస్ ఛైర్మన్‌గా పరిశోధనల ద్వారా ప్రభుత్వ విధానాలలో జవాబుదారీతనం పెంచేందుకు కృషి చేశారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడంలో ఆయన చూపిస్తున్న నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *