– మాజీ మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 3: కెసిఆర్‌కు కూతురుకన్నా, పార్టీ ముఖ్యమని, అందుకే సస్పెండ్ చేశారని భారత రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌పై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. పార్టీని ధిక్కరించిన ఆమెపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని చెప్పారు. బోయిన్‌పల్లిలో శ్రీవెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజా కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు కుమార్తె, కుమారుడు ముఖ్యం కాదు.. ఆయనకు పార్టీయే ముఖ్యం. దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయి. ప్రతి కుటుంబంలో గొడవలు సహజం. తెలంగాణ ప్రజలే కేసీఆర్‌కు ముఖ్యం. తన కుమార్తె, కుమారుడి కోసం పార్టీని ఆయన నాశనం చేసుకోలేరు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో సీబీఐ మాత్రమే కాదు.. ఎవరూ ఏ చేయలేరు. సీబీఐ పేరుతో కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలనుకోవడం సరికాదు. ఆయనలాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ నాయకుడిగా ఉండటం మనందరి అదృష్టం. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డ్రామాలు చేస్తోందని మల్లారెడ్డి విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




