ఘనంగా మల్లన్న ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం 

కొమురవెల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్ 10: రాష్ట్రంలోప్రసిద్ధిగాంచిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం బుధవారం ఘనంగా జరిగింది. కమిటీ చైర్మన్ గా గంగం నర్సింహా రెడ్డి, సభ్యులుగా చికిరి కోమరయ్య, మెరుగు నరేష్ గౌడ్, పల్లె మహేష్, వంగరి వరలక్ష్మి, నంగునూరి సత్యనారాయణ, కటం శ్రీనివాస్, సర్ల లింగం, పయ్యవుల ప్రవీణ్ కుమార్ యాదవ్, అలుగల మల్లేశం, బొచ్చు ఎల్లయ్య, గొరిగె రవి ప్ర‌మాణం చేశారు. ఈ సందర్బంగా చైర్మన్ గంగం నర్సింహా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్గా, నాతోటి మిగతా మెంబర్లు ఎన్నికవ్వడం పూర్వజన్మ సుకృతంగా భావి స్తున్నామ‌న్నారు. ఈ నెల 14వ తేదీన స్వామి వారి కళ్యాణం అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో నూతనంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *