ఇంటర్‌ ‌పరీక్షల్లో మాల్‌ ‌ప్రాక్టీస్‌

‌- పట్టుబడ్డ నలుగురు విద్యార్థులు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 26: రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్‌ ‌పరీక్షల రెండో రోజు గురువారం ఇంటర్‌ ‌ద్వితీయ సంవత్సరం సెకండ్‌ ‌లాంగ్వెజ్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్‌‌డియట్‌ ‌బోర్టు సెక్రటరీ తెలిపారు. మొత్తం 4,63,354 మంది విద్యార్థులకు గాను 4,52,980 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. 10,374 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు. వరంగల్‌లో 3, రంగారెడ్డి జిల్లాలో ఒకరు మాల్‌ ‌ప్రాక్టీసుకు పాల్పడుతూ అధికారులకు పట్టుబడ్డారని పేర్కొన్నారు. వనపర్తి, వికారాబాద్‌, ‌భద్రాద్రి, ఆదిలాబాద్‌, ‌మంచిర్యాల, వరంగల్‌, ‌సిద్దిపేట, మెదక్‌, ‌కరీంనగర్‌, ‌ములుగు, పెద్దపల్లి పరీక్షా కేంద్రాల పర్యవేక్షణకు పరిశీలకులను నియమించినట్లు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *