నిజామాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ కుటుంబాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క గురువారం పరామర్శించారు. పూర్ణ తండ్రి ఇటీవల మరణించగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిలతో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గల పూర్ణ నివాసానికి ఆమె వెళ్లారు. పూర్ణను ఓదార్చి ధైర్యం చెప్పారు. తెలంగాణ కీర్తిని ఎవరెస్టు అంత ఎత్తుకు చాటిన పూర్ణ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





