మూసీ అభివృద్ధిలో భాగస్వాములను చేయండి

– మూడు ప్రతిపాదనలను పరిశీలించండి
– ఉప ముఖ్యమంత్రికి మధు పార్క్ రిడ్జ్ నిర్వాసితుల వినతిపత్రం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునర్జీవ పథకంలో భాగస్వాములను చేయాలని, నిర్వాసితులుగా తమకు న్యాయం చేయాలని మధు పార్క్ ‘ఎ’ బ్లాక్ నిర్వాసితులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు వినతిపత్రం సమర్పించారు. అందుకు మూడు ప్రతిపాదనలను పరిశీలన కోసం సమర్పిస్తున్నామన్నారు. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంను మధు పార్క్ రిడ్జ్ ‘ఎ’ బ్లాక్ నిర్వాసితులు సోమవారం మధ్యాహ్నం కలిశారు. మూసీ పునర్జీవ పనులను స్వాగతిస్తున్నామని, అభివృద్ధి పనులపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ తమను కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని కోరారు. నిర్వాసితుల ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం స్పందిస్తూ మూడు ప్రతిపాదనలను మానవీయ కోణంలో ఆలోచించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించి మూసీ కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక ఇవ్వాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిలను ఆదేశించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో మధు పార్క్ రిడ్జ్ ‘ఎ’ బ్లాక్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.శ్రీశైలం, సెక్రటరీ డాక్టర్ కరీముల్లా, సలహాదారు సంజయ్ శుక్ల, లీగల్ అడ్వైజర్ ప్రతాపరెడ్డి, జేఏసీ బి.ఎన్.రెడ్డి, ఉపాధ్యక్షుడు రాంబాబు తదితరులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *