అభివృద్ధి కోసం కాంగ్రెను గెలిపించండి

– అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యం
– మంత్రి వాకిటి శ్రీహరి

ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : అభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కల్వకుర్తి నియోజ కవర్గం ఆమనగల్లు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డుల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు వార్డులలో మాట్లాడుతూ ఆమనగల్లు పట్టణం అభివృద్ధి చెందాలంటే చేతి గుర్తుకు వోటేసి అన్నీ వార్థులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల న్నారు. పేదల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పెద్ద మనసుతో కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిం దన్నారు. మహిళలకు మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేసి కోటీశ్వరులు చేసేందుకు చిత్తశు ద్ధితో పని చస్తున్నామని తెలిపారు. బ్యాం కులో వడ్డీకి తీసుకున్న మహిళా సంఘా లలో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి పేరు మీద ఉన్న రుణాన్ని మాఫీ చేయ డంతో పాటు ఆర్థిక సహాయం అందజే యడం జరుగుతుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ప్రతీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై ఉందని స్పష్టం చేశారు. మంత్రితో పాటు ఆమనగల్లు మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జ్ శ్రీనివాస్ గౌడ్, అభ్యర్థులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *