కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి

– హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం
– తెలంగాణలో పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు
– పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో మంత్రులు భట్టి, పొన్నం

పుదుచ్చేరి, ఏప్రిల్ 3: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకు, రాజ్యాంగం మనకు కల్పించిన గౌరవం, స్వేచ్ఛను కాపాడుకోవాలంటే కాంగ్రెస్, డీఎంకే కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్, పుదుచ్చేరి పీసీసీ అధ్యక్షుడు విద్యలింగంతో కలిసి పుదుచ్చేరిలోని మనవేలి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనంతరామన్‌కు, ఎంబాలం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతన్‌కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురండి… పుదుచ్చేరిని రక్షించండి అని ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, డీఎంకేలతో కూడిన sజూa కూటమి ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉంటుందని భరోసా ఇచ్చారు. తమ కూటమి హామీల అమలుపై ఎన్డీయే కూటమి చేస్తున్న అసత్యాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దన్నారు. పుదుచ్చేరి బంగారు భవిష్యత్తుకు ఎస్‌పీఏ కూటమిని గెలిపించడం ఒక్కటే పరిష్కారమార్గం అన్నారు. గ్యారంటీలు అమలు సాధ్యమా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమే అని డిప్యూటీ సీఎం అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. మహిళలను బస్సుల యజమానులుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్-2047 ప్రకారం తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపనున్నామని డిప్యూటీ సీఎం ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వృద్ధి రేటు 10.8 శాతంగా ఉందని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్యమని తాము నిరూపించామని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *