– మార్మోగిన స్వామి శరణం నామస్మరణం
– పులకించిన అయ్యప్ప భక్తులు
తిరువనంతపురం, జనవరి 14: శబరిగిరులపై మకర జ్యోతి దర్శనమిచ్చింది. దాంతో స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణల మధ్య మకర జ్యోతిని అయ్యప్ప మాలధారణలో ఉన్న స్వాములు భక్తి తన్మయత్వంతో దర్శించుకున్నారు. జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి సందర్భంగా సాయంత్రం 6.30 గంటల నుంచి 6.45 గంటల మధ్య మఠర జ్యోతి దర్శనమిచ్చింది. అయితే ఈసారి మకరవిలక్కు ఉత్సవాలకు వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేరళ హైకోర్టు ఆదేశాలతో దర్శన కోటాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దాంతో పోలీసులు పక్కాగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మకర దర్శనం కోసం సన్నిధానం, పంబ, శబరిమల, నీలిమల ప్రాంతాలు అయ్యప్ప స్వాములతో కిక్కిరిసిపోయాయి. దాంతో బుధవారం ఉదయం 10గంటల తర్వాత పంబ నుంచి సన్నిధానానికి భక్తులను అనుమతించలేదని సమాచారం. పంచగిరులు.. నీలిమల, కరిమల, శబరిమల, అప్పాచిమేదు, అలుదా మేడు ప్రాంతాల్లో ఈ దివ్య జ్యోతి దర్శనం స్పష్టంగా కనిపించింది. దాంతో ఆయా ప్రాంతాలన్నీ భక్తులతో నిండిపో యాయి. శబరిమలలో సంక్రాంతి పండగ వేళ.. పంచగిరులపై మకరవిలక్కు (మకర జ్యోతి)గా అయ్యప్ప స్వామి వారు దర్శనమిస్తారని భక్తులు ప్రగాఢ విశ్వాసం. గత కొన్ని శతాబ్దాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. దాంతో లక్షలాది మంది భక్తులు శబరిమలకు మకర సంక్రాంతి వేళ.. తరలివస్తారు. మరోవైపు బుధవారం మధ్యాహ్నం 3.13 గంటల నుంచి మకర సంక్రాంతి పుణ్యకాలం ప్రారంభమైంది. దీంతో స్వామివారికి మేల్ శాంతుల పేరిట తంత్రిలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. 12న పందళం రాజప్రసాదం నుంచి బయలుదేరిన స్వామివారి అభరణాలు ఈ రోజు సాయంత్రం 5.20 గంటలకు స్వామివారి సన్నిధికి చేరుకున్నాయి. వాటిని స్వామివారికి అలంకరించి మహ దీపారాధన నిర్వహించారు. ఈ దీపారాధన పొన్నంబలమేడుపై మకరజ్యోతి మూడుసార్లు దర్శనమిచ్చింది. సాయంత్రం 6.30 గంటల నుంచి 6.45 గంటల వరకు అంటే పావుగంట మధ్య మూడుసార్లు స్వామివారు దీప రూపంలో దర్శనమిచ్చారు. 19వ తేదీ వరకు స్వామివారి దర్శనం కొనసాగనుంది. ఆ మరునాడు జనవరి 20న ఆలయాన్ని మూసివేయనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




