- డి.గుకేశ్, హర్మన్‌ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్, మను బాకర్ ఎంపిక
- అర్జున అవార్డుకు 32మంది, ద్రోణాచార్య అవార్డుకు ఐదుగురి ఎంపిక
- అర్జున అవార్డుల్లో దీప్తి, యర్రాజీలకు చోటు
క్రీడా రంగంలో విశేష ప్రతిభకనబరిచిన క్రీడాకారులను అవార్డులతో కేంద్రం గౌరవించింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారాలకు నలుగురిని ఎంపిక చేసిన కేంద్రం.. అర్జున అవార్డుకు 32మందిని, ద్రోణాచార్య అవార్డుకు ఐదుగురిని ఎంపిక చేసింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 ఏడాదికి గాను నలుగురు క్రీడాకారులను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు ఎంపిక చేసింది. చెస్ విభాగంలో డి.గుకేశ్, హాకీ విభాగంలో హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్, షూటింగ్ విభాగంలో మను బాకర్‌ను ఈ అవార్డులు వరించాయి. అలాగే, 32మందిని అర్జున, ఐదుగురికి ద్రోణాచార్య పురస్కారాలకు ఎంపిక చేశారు. అర్జున పురస్కారాలు దక్కించుకున్నవారిలో 17మంది పారా అథ్లెట్స్ ఉండటం విశేషం. జనవరి 17న ఉదయం 11గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల వి•దుగా వీరంతా పురస్కారాలను అందుకుంటారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడామంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.భారత స్వాతంత్య్ర వొచ్చాక.. ఒకే ఒలింపిక్ గేమ్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా మను బాకర్ ఘనత సాధించింది. 2024 పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ వ్యక్తిగత విభాగంతోపాటు మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్యాలను సొంతం చేసుకుంది.
తొలి జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రకటించిన జాబితాలో పేరు ఉండటంతో క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన గుకేశ్‌కు ఖేల్ రత్న అవార్డు వరించింది. ఫైనల్‌లో చైనా ప్లేయర్‌పై అద్భుత విజయంతో ఛాంపియన్‌గా నిలిచాడు. ఒలింపిక్స్‌లో వరుసగా భారత్ రెండో పతకం సాధించడంలో హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. పారాలింపిక్స్‌లో ప్రవీణ్ కుమార్ హై జంప్ విభాగంలో బంగారు పతకం సాధించాడు. ఇక అర్జున అవార్డులు దక్కిన వారిలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఉన్నారు. జ్యోతి యర్రాజి (అ•-లథెటిక్స్),దీప్తి జువ్వాంజి ఉన్నారు.
ఇక మిగిలిన వారిలో అన్ను రాణి (అ-లథెటిక్స్), నీతు (బాక్సింగ్), స్వీటీ బురా (బాక్సింగ్), అవంతిక అగర్వాల్ (చెస్), సలీమా (హాకీ), అభిషేక్ (హాకీ), సంజయ్ (హాకీ), జర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), సుఖ్‌జీత్ సింగ్ (హాకీ) స్వప్నిల్ సురేష్ కుసాలే (షూటింగ్), సరబ్‌జోత్ సింగ్ (షూటింగ్), అభయ్ సింగ్ (స్క్వాష్), సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్),అమన్ (రెజ్లింగ్),రాకేశ్ కుమార్ (పారా ఆర్చర్),ప్రీతి పాల్ (పారా అథ్లెటిక్స్),అజీత్‌సింగ్ (పారా అథ్లెటిక్స్),సచిన్ సర్జేరావు ఖిలారి (పారా అథ్లెటిక్స్),ప్రణవ్ సూర్మ (పారా అథ్లెటిక్స్),హెచ్. హోకాటో సీమ(పారా అథ్లెటిక్స్), సిమ్రాన్ (పారా అథ్లెటిక్స్), నవ్‌దీప్ (పారా అథ్లెటిక్స్), నితీశ్ కుమార్ (పారా బ్యాడ్మింటన్), తులసీమతి మురుగేశన్ (పారా బ్యాడ్మింటన్), నిత్య శ్రీ సుమతి శివన్ (పారా బ్యాడ్మింటన్) మనీశా రాం దాస్ (పారా బ్యాడ్మింటన్), కపిల్ పర్మార్ (పారా జుడో),మోనా అగర్వాల్ (పారా షూటింగ్) రుబినా ఫ్రాన్సిస్ (పారా షూటింగ్), అర్జున అవార్డస్ (లైఫ్‌టైమ్), సుచా సింగ్ (అ•-లథెటిక్స్), మురళీకాంత్ రాజారాం పెట్కర్ (పారా స్విమ్మింగ్) ఉన్నారు. ఇక ద్రోణాచార్య అవార్డులు (కోచ్‌లు) దక్కించుకున్నవారిలో సుభాష్ రాణా (పారా షూటింగ్), దీపాలీ దేశ్‌పాండే (షూటింగ్), సందీప్ సంగ్వాన్ (హాకీ), లైఫ్‌టైం కేటగిరీలో.. మురళీధరన్ (బ్యాడ్మింటన్), అర్మాండో ఆగ్నెలో కొలాకో (ఫుట్‌బాల్) ఉన్నారు.





