రూ.547 కోట్ల సైబర్ దోపిడీ కేసు

– ప్రధాన నిందితుడు వికాస్ చౌదరి అరెస్ట్

సత్తుపల్లి/ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: రూ.547 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో ప్రధాన నిందితుడు ఉడతనేని వికాస్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 40 రోజులుగా పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు వీఎం బంజర, కల్లూరు పోలీసులు హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అంతర్జాతీయ నేరగాళ్లతో కలిసి కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి రూ. వందల కోట్ల మేర సైబర్ నేరాలకు పాల్పడ్డారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించి వాటిని సైబర్ నేరాలకు వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో 2025 డిసెంబర్ 24న పోట్రు ప్రవీణ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆ తర్వాత మరో 18 మందిని ఈ ఏడాది జనవరి 11న అరెస్టు చేశారు. ప్రధాన నిందితులుగా ఉన్న పోట్రు మనోజ్, మేడ భానుప్రియ, మేడ సతీష్, మోరంపూడి చెన్నకేశవలను దశలవారీగా అరెస్టు చేసి రిమాండ్ చేశారు. అప్పటినుంచి కీలక నిందితుడైన ఉడతనేని వికాస్ చౌదరి పరారీలో ఉండటంతో సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తిలింగయ్య ఆధ్వర్యంలో వీఎం బంజర, కల్లూరు పోలీసులు పలు నగరాల్లో గాలించారు. 40 రోజుల తర్వాత అతడిని అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసులో ప్రధాన నిందితులందరూ అరెస్టు అయినట్లు పోలీసులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *