– మంత్రి సీతక్క చొరవతో ఎస్‌హెచ్‌జీ మహిళలకు లబ్ది
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: మహిళాభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రతి సందర్భాన్ని మహిళల ఆర్ధిక చేకూర్పునకు అవకాశంగా మార్చాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంకల్పించారు. మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ఆహార పదార్ధాలు విక్రయించేందుకు ఇందిరా మహిళా శక్తి ద్వారా రూ.6 కోట్ల వ్యయంతో 565 షాపులను ప్రభుత్వం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం 37 ప్రదేశాల్లో 27 రకాల వ్యాపారాలను మహిళలు నిర్వహించనున్నారు. అందులో మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో 464 యూనిట్స్, మేడారం రాకపోకలు జరిగే మార్గంలో 63 యూనిట్స్ ఏర్పాటు చేశారు. మిగిలిన యూనిట్స్ ఇతరచోట్ల నెలకొల్పారు. ఇందిరా మహిళా శక్తి పధకం కింద సెర్ప్ బ్యాంకు లింకేజీ రూ.341.30 లక్షలతో 315 యూనిట్స్, సెర్ప్ సీఐఎఫ్ నిధులు రూ.86.50 కోట్లతో 80 యూనిట్లు, స్త్రీనిధి రూ.92 లక్షలతో 90 యూనిట్లు, మండల సమాఖ్య సీఐఎఫ్ రూ.64 లక్షలతో 60 యూనిట్లు, గ్రామ సమాఖ్య నిధులు రూ.19.50 లక్షలతో 20 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క చొరవతో మేడారం జాతర సందర్బంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వారా ఈ ప్రాంత సంఘాల మహిళలు లబ్ది పొందనున్నారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా ఇప్ప పువ్వు లడ్డులు, మిల్లెట్ లడ్డులు, రాగి లడ్డులు, పల్లీ లడ్డులు విక్రయ స్టాల్స్, ఇప్ప నూనె, కోల్డ్ ప్రెస్ ఆయిల్, కారం, పసుపు, మసాలా యూనిట్స్, రాగి జావ/టిఫిన్, రొట్టెల యూనిట్, మిల్లెట్ షేక్, స్వీట్ కార్న్, పాప్ కార్న్, టీ స్టాల్స్, స్నాక్స్ స్టాల్స్, తెలంగాణ పిండి వంటలు, పచ్చళ్ళు, పూజా సామగ్రి విక్రయ స్టాల్స్‌తోపాటు బేకరీ, బ్యాంబు చికెన్, చికెన్, క్లాత్ రెడీ మేడ్ డ్రెస్సెస్, గాజులు, బెల్లం, కొబ్బరికాయలు, పూలు, భోజన, అల్పాహార, కిరాణా జనరల్ స్టోర్, కూల్ డ్రింక్స్, పాలు, ఫాస్ట్ ఫుడ్, మొబైల్ ఫిష్ అండ్ కర్రీ అవుట్‌లెట్, కోళ్ల విక్రయ అవుట్‌లెట్, కోడి గుడ్ల స్టాల్స్ ఏర్పాటు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




