– ఒక్కో మహిళ ఖాతాలో రూ.10వేలు
– మహిళా రోజ్‌గార్‌కు ప్రధాని మోదీ ప్రారంభం
న్యూదిల్లీ/పాట్నా,సెప్టెంబర్ 26: అసెంబ్లీ ఎన్నికలు సపిస్తోన్న తరుణంలో బిహార్ ప్రభుత్వం అక్కడి మహిళలకు నవరాత్రి కానుక అందించింది. ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున 75లక్షల మంది మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేసింది. శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ ప్రారంభించడం ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. దిల్లీలో ఉన్న మోదీ వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, ఇతర మంత్రులు హాజరయ్యారు. రూ.7,500 కోట్లతో బిహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకు వొచ్చింది. మహిళా సాధికారత, స్వయంఉపాధి కల్పించడం దీని ఉద్దేశం. ప్రతి కుటుంబంలో ఒక మహిళకు ఈ స్కీమ్ కింద రూ.10వేలు నేరుగా అందాయి. తర్వాత వివిధ దశల్లో ఆ సహాయం రూ.2 లక్షల వరకు ఉండనుంది. స్వయంఉపాధి కోసం పశుపోషణ, వ్యవసాయం, టైలరింగ్ వంటి రంగాల్లో ఆ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.. ఈ కార్యక్రమం సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఈ నవరాత్రి సందర్భంగా బిహార్ మహిళల సంతోషంలో నేనూ భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఇక్కడ నాకు స్క్రీన్‌పై లక్షలాదిమంది మహిళలు కనిపిస్తున్నారు. వారి ఆశీర్వాదాలు మాకు గొప్ప బలం అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ కోసం పని చేస్తున్నారు. గత ప్రభుత్వం అలా కాదు. లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ… సీఎం పదవిని కోల్పోయినప్పుడు.. తన సతీమణిని ముఖ్యమంత్రిని చేశారు. తన కుటుంబం గురించి మాత్రమే ఆందోళన చెందారు. మేం మాత్రం బిహార్ ప్రజలందరి కోసం పనిచేస్తామని విపక్ష ఆర్జేడీపై నీతీశ్‌కుమార్ విమర్శలు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





