– కెటిఆర్ విమర్శలపై మండిపడ్డ పిసిసి చీఫ్ మహేష్
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్13: వోట్ చోరీ గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో నిరూపించారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దేశవ్యాప్తంగా దీనిపై ఉద్యమిస్తున్న వేళ రాహుల్‌కు మద్దతు పెరిగిందని అన్నారు. మోదీ ఈ విషయంలో అడ్డంగా దొరికారని అన్నారు. ఓ జాతీయ అంశంపై పోరాటం చేస్తుంటే..బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల గురించి రాహుల్ ఎందుకు మాట్లాడాని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం సిబిఐకి అప్పజెప్పినా కేంద్రంలో ఎందుకు కదలిక లేదని అన్నారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు జైలు ఖాయం అని అన్నారు. దిల్లీలో బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు, కెటిఆర్, మోదీని కలిశారని తెలియజేశారు. వాళ్లు బిజెపిలో చేరినట్లు తాము కూడా నోటీసులు పంపిస్తామని, సిఎంగా రేవంత్ రెడ్డిని అందరూ కలుస్తారని మహేష్ పేర్కొన్నారు. ఫిరాయింపులపై రాహుల్ స్పందించాలని కెటిఆర్ అంటున్నారని చెప్పారు. రాహుల్ పై మాట్లాడే అర్హత కెటిఆర్ కు ఉందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ తప్పించుకోవడానికే.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బిఆర్‌ఎస్ దూరంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





