అర్బన్ బ్యాంక్ ఎన్నికలు స‌జావుగా నిర్వహించాలి

– ఏర్పాట్లను పరిశీంచిన ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ మ‌ను చౌద‌రి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 5: ఏపీ మహేష్ అర్బన్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ల ఎన్నికల సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి విజ‌య‌వంతం చేయాల‌ని హైద‌రాబాద్ జిల్లా ఇన్‌చార్జి క‌లెక్ట‌ర్ మ‌ను చౌద‌రి అధికారులకు సూచించారు. ఈ ఎన్నికలు ఈ నెల 7న జ‌రగ‌నున్న నేప‌థ్యంలో ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్ లో చేప‌ట్టిన ఏర్పాట్ల‌ను డీఆర్వో ఇ.వెంకటాచారితో క‌లిసి శుక్ర‌వారం ప‌రిశీలించారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య‌, ఓట్ల సంఖ్య‌, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్ల‌ను, ఎన్నిక‌ల సామగ్రి పంపిణీ ఎపుడు, ఎంతమంది సిబ్బందిని నియ‌మించారు, పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు, ఎన్నిక‌ల సిబ్బందికి శిక్ష‌ణ త‌ర‌గ‌తులు వంటి వివ‌రాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. తదుపరి బ్యాలెట్ ప‌త్రాల‌ను ఆయ‌న పరిశీలించారు. ఈ సంద‌ర్బంగా మ‌నుచౌద‌రి మాట్లాడుతూ ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో, స‌రిప‌డ లైటింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు అన్ని వ‌స‌తులు క‌ల్పించాల‌ని అధికారుల‌కు సూచించారు. ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర ముంబై, రాజస్థాన్ లోని జైపూర్, బిల్వాడ , ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, తెలంగాణ‌లోని ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ క‌రీంన‌గ‌ర్ ల‌లో ఎన్నిక‌లు జ‌రగ‌నున్నందున అక్క‌డ విధులు కేటాయించిన సిబ్బందికి ముందస్తుగా ఎన్నిక‌ల సామగ్రీని పంపిణీ చేస్తామ‌ని, హైద‌రాబాద్ ఎన్నికల సిబ్బందికి సామగ్రీ అందజేయాలని తెలిపారు. ఆయ‌న వెంట‌ హైద‌రాబాద్‌, సికింద్రాబాద్ ఆర్డీవోలు రామ‌కృష్ట‌, సాయిరాం, లా ఆఫీస‌ర్ శ్రీ‌ధ‌ర్‌, స్పెష‌ల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ జ్యోతి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ప్రసన్న, త‌హాసీల్దార్ నయీముద్దీన్, సిఐ భ‌ర‌త్ కుమార్‌, అధికారులు , సిబ్బంది ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *