మహావతార్‌ నరసింహ బాక్సాఫీస్‌ హిట్‌

– దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన యానిమేటెడ్‌ చిత్రం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన మహావతార్‌ నరసింహ’లిలి భారత బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. విడుదలైన కేవలం 10 రోజుల్లోనే రూ. లిలి91.25 కోట్లు వసూలు చేసి దేశంలో ఇప్పటివరకు విడుదలైన యానిమేటెడ్‌ చిత్రాలలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. పలు భాషల్లో విడుదలైన ఈ పౌరాణిక డ్రామా భారత యానిమేషన్‌ రంగానికి ఒక కొత్త దిశను సూచిస్తూ మన సంప్రదాయ కథనాలకు ఆశాజనకమైన భవిష్యత్తును సూచిస్తోంది. ప్రహ్లాద మహారాజు జీవితం, నరసింహావతారం అంశాలపై ఆధారంగా ఉన్న ఈ యానిమేటెడ్‌ పౌరాణిక చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. విడుదలైన పది రోజుల్లోనే రూ.91.25 కోట్ల వసూళ్లను నమోదు చేసి భారతీయ యానిమేటెడ్‌ చిత్రాల్లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఈ చిత్రం ‘స్పైడర్‌-మ్యాన్‌’, ‘కుంగ్‌ ఫు పాండా’ వంటి అంతర్జాతీయ బ్లాక్‌బస్టర్‌లను భారతీయ బాక్సాఫీస్‌ వద్ద దాటి పోయింది. ూaషఅఱశ్రీస.షశీఎ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటివరకు రూ.112 కోట్లు వసూలు చేసింది. 2డీ, 3డీ ఫార్మాట్లలో, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రత్యేకంగా తెలుగు 3డీ వెర్షన్‌లో 88.94 శాతం ఆక్యుపెన్సీ సాధించడమేకాక హిందీ 3డీ వెర్షన్‌ కూడా 68.30 శాతం ఆక్యుపెన్సీతో బలమైన స్పందనను నమోదు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *