మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ఖిల్లా

– త్యాగాల చరిత్ర గాంధీ కుటుంబానిది
-అబద్దాల పుట్ట బీజేపీ, బీఆర్ఎస్
– భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలవడం ఖాయం.
-పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తాం.
– టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

మహబూబ్ నగర్ ప్రజాతంత్ర, ఏప్రిల్ 7 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ ఖిల్లా అని, గత అసెంబ్లీ ఎన్నికల్లో 14కు 12 స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది.. మిగిలిన స్థానాల్లో ఒకరు కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిప, కార్పొ రేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసి కాంగ్రెస్ ఖిల్లా గా మార్చారాని, మహబూబ్ నగర్ లో రాజకీయ చైతన్య తో భవిష్యత్ లోను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 సీట్లు గెలవడం ఖాయం అని అన్నారు. మంగళవారం మహ బూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సంజీవ్నూ ముదిరాజ అధ్యక్ష తన ఏర్పాటు చేసిన నూతనగా నియమితులైన జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంకు ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించి, వారికి దిశానిర్దే శం చేశారు. రేవంత్ రెడ్డి పాలన దేశానికే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందని అన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తు న్నారని అన్నారు రు.23 వేల కోట్ల రైతు రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ . సన్నబియ్యం పం పిణీతో పేదల ఆకలి తీరుస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మం జూరు చేస్తూ ముందుకుపోతున్నారు అన్నారు. బీజేపీ, బిర్ఎస్ పై నిప్పులు చేరిగారు. మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని గత బీఆర్ఎస్ ప్రభు త్వం ప్రజలను నిలువునా ముంచాయని విమ ర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పుట్ట అని కొనియాడారు. “మోతీలాల్ నెహ్రూ: నుంచి రాహుల్ గాంధీ వరకు గాంధీ కుటుం బం దేశం కోసం సర్వస్వం త్యాగం చేసింది. 2004లో సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ వంటి మేధావిని ఆ పీఠంపై కూర్చోబెట్టారు. కులమతాలకు అతీతంగా అందరినీ అక్కున చేర్చుకునే గొప్ప సంస్కృతి కాంగ్రెస్ పార్టీ ది అన్నారు. సాధారణ కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎదిగిన మల్లికార్జున ఖర్గే జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొ న్నారు. పదేళ్లుగా మోదీ పాలిస్తున్నా పేదవాడి జీవితంలో వెలుగు రాలేదు.అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. ఉద్యోగాల ఊసే లేదు. కేవలం శ్రీరామచంద్రుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు తప్ప, తాము చేసిన అభివృద్ధిని చూపించే ధైర్యం బీజేపీకి లేదు,” అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో రా ష్టం అప్పుల కుప్పగా మారింది అని 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక విచ్చి న్నం చేశారు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ‘కూలేశ్వరం’గా మార్చి ప్రజాధనాన్ని కాంట్రా
క్టర్ల జేబుల్లో నింపారు,” అని మండిపడ్డారు. పాలమూరు అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. మహబూబ్ నగర్ జిల్లా వలసల జిల్లాగా కా కుండా ధనాగార జిల్లాగా మారుస్తామని మహే ష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. “కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం, రాహుల్ గాంధీ ప్రధాని కావడం నిశ్చయం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ కత్వంలో ఫోర్డ్ సిటీ ద్వారా లక్షల కోట పెట్టట్టర్ డులు రాష్ట్రానికి వస్తున్నాయి. పదేళ్లలో తీసుకురాని పెట్టుబడులను మేము కేవలం మూడు నెలల్లోనే తెచ్చి చూపించాం.” అని గర్వంగా ప్రకటించారు.

కార్యకర్తలే పార్టీ గుండెకాయ
కాంగ్రెస్ పార్టీ గుండెకాయ ఢిల్లీలో లేదని, గ్రామాల్లోని కార్యకర్తల వద్ద ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తనకు వచ్చిన పీసీసీ అధ్యక్ష పదవే కష్టపడే కార్యకర్తకు ఇచ్చే గుర్తింపునకు నిదర్శనమని అన్నారు. నూతనంగా పదవులు పొందిన వారు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను (రైతు రుణమాఫీ, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు) వివరించాలని పిలుపు నిచ్చారు కార్యక్రమంలో రాష్ట్ర ఇంచార్జి ఏఐసీసీ కార్యదర్శి, సి. డబ్ల్యూ, సి. ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చందర్, ప్రభుత్వ విప్ మహబూబ్నగర్ మ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి,దేవరకద్ర మ్మెల్యే జీఎంర్, నారాయణపేట జిల్లా అధ్యక్షులు ప్రశాంత్రీ రెడ్డి, మహబూబ్నగర్పీ మేయర్సీ మమత, ఉప మేయర్సీ సురేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు వినోద్నా, మిథున్య,కులు, ఎమ్మెల్యేలు, భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *