– వైస్ చైర్మన్‌గా ధని కుమార్
– పురపాలక నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
– ఎక్స్ అఫీషియో ఓటు వేసి డిప్యూటీ సీఎం భట్టి
మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. పట్టణ ప్రథమ పౌరురాలిగా సామినేని సుజాత, వైస్ చైర్మన్‌గా కోన ధని కుమార్ ఎన్నికయ్యారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ ఎన్నిక కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎక్స్ అఫీషియో సభ్యుడిగా హాజరై తన ఓటు హక్కును వినియోగం వినియోగించుకున్నారు. అంతకుముందు తన క్యాంపు కార్యాలయానికి నూతన కాంగ్రెస్ కౌన్సిలర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాదరంగా ఆహ్వానించారు. భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు వారిని అభినందించిన ఆయన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. అనంతరం క్యాంపు కార్యాలయం నుంచి కౌన్సిలర్లతో కలిసి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు.
ప్రమాణ స్వీకారం.. ఎక్స్ అఫీషియో ఓటు
ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో తొలుత నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. మెజారిటీ సభ్యుల మద్దతుతో చైర్‌పర్సన్ పదవికి సామినేని సుజాత, వైస్ చైర్మన్ పదవికి కోన ధని కుమార్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి నవీన్‌బాబు ప్రకటించారు.
అభివృద్ధికి బాటలు వేస్తాం: భట్టి
ఎన్నిక అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ. మధిర మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా చూస్తామని, ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని కౌన్సిలర్లకు సూచించారు. నూతనంగా పాలకవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

