– అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి శంకుస్థాపనలు
ఎర్రుపాలెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: గ్రామీణ మౌలిక వసతులతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి సుమారు రూ.4 కోట్ల విలువైన ఎస్సీ సబ్ ప్లాన్ రోడ్లకు మంగళవారం శంకుస్థాపనలు చేశారు. ముందుగా ఎర్రుపాలెం ఎస్సీ కాలనీలో రూ.45 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ సబ్ ప్లాన్ రోడ్లుకు శంకుస్థాపన చేశారు.పెద్ద గోపవరం గ్రామంలో రూ.85 లక్షలతో నిర్మించే ఎస్సీ సబ్ ప్లాన్ రోడ్ల శంకుస్థాపన, పెద్ద గోపారం గ్రామంలో రూ.12 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడి కేంద్రం నూతన భవనంనకు శంకుస్థాపన, బుచ్చిరెడ్డిపాలెంలో రూ.40 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ సబ్ ప్లాన్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. బనిగండ్లపాడులో రూ.175 లక్షలతో నిర్మించే ఎస్సీ సబ్ ప్లాన్ రోడ్లకు శంకుస్థాపన, అయ్యవారిగూడెంలో రూ.55 లక్షలతో నిర్మించే ఎస్సీ సబ్ ప్లాన్ రోడ్లకు శంకుస్థాపన, భీమవరం విద్యానగర్ గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ నూతన భవనమునకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ అభివృద్ధి పథంలో మధిర నియోజకవర్గ ముందుండేలా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రతి గ్రామానికి అభివృద్ధి వసతులు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, గ్రామాలలో అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో జి నరసింహారావు, విద్యుత్ ఎస్‌ఈ శ్రీనివాసచారి, భద్రాద్రి జిల్లా డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్, పిఆర్ ఈఈ వెంకటరెడ్డి, తహసిల్దార్ మన్నె ఉషా శారద, ఎంపీడీవో బి సురేందర్, వివిధ శాఖల అధికారులు,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు,మండల పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి,చావా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వేజెండ్ల సాయికుమార్, శీలం.శ్రీనివాసరెడ్డి, అనుమోలు కృష్ణారావు, జిల్లా నాయకులు యరమల పూర్ణచంద్రారెడ్డి, పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




