– సంతాపం ప్రకటించిన జైరామ్ రమేశ్
పూనె, జనవరి 8: ప్రఖ్యాత పర్యావేరణవేత్త మాధవ్ గాడ్గిల్ (82) కన్నుమూశారు. ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పూనెలోని తన నివాసంలో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు సిద్దార్థ్ గాడ్గిల్ గురువారం వెల్లడించారు. మాధవ్ గాడ్గిల్ పశ్చిమ కనుమల పర్యావరణ ప్రాముఖ్యతకు ఆయన విశేష కృషి చేశారు. ప్రపంచ జీవవైవిధ్య హాట్‌స్పాట్ అయిన పశ్చిమ కనుమలలో ఆయన చేసిన కృషికి గాను 2024లో ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ గౌరవమైన వార్షిక ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును బహూకరించింది. ••గా, ఆయన పర్యావరణానికి సంబంధించి విలువైన సిఫార్సులను అందించారు. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో పర్యావరణానికి నష్టం చేకూర్చకుండా కఠినమైన ఆంక్షలను తన నివేదికలో సిఫార్సు చేశారు. వాటిల్లో కొత్త రోడ్లు లేదా భవన నిర్మాణాల కట్టడాలకు అనుమతించరాదని, నిటారుగా ఉన్న వాలులో అభివృద్ధి చేయరాదని, రాతి తవ్వకాలపై నిషేధం విధించాలని ఆయన సిఫార్సు చేశారు. మాధవ్ గాడ్గిల్ మృతికి మాజీ పర్యావరణశాఖా మంత్రి, కాంగ్రెస సీనియర్ నేత జైరాం రమేశ్ సంతాపం తెలిపారు. ’మాధవ్ గాడ్గిల్ ఒక అత్యున్నతస్థాయి విద్యావేత్త, అవిశ్రాంత క్షేత్ర పరిశోధకుడు, మార్గదర్శక సంస్థ నిర్మాత, గొప్ప సంభాషణకర్త, ప్రజల నెట్‌వర్క్‌లు, ఉద్యమాలను దృఢంగా నమ్మిన వ్యక్తి, ఐదు దశాబ్దాలకు పైగా చాలామందికి స్నేహితుడు, తత్వవేత్త, మార్గదర్శి, గురువు. ఆధునిక శాస్త్రంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాలలో శిక్షణ పొందిన ఆయన జీవవైవిధ్య పరిరక్షణలో ఛాంపియన్‌గా నిలిచారు’ అని జైరాం రమేష్ తన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. అలాగే మాధవ్ స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచిపోతారని జైరాం రమేష్ అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





