– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10: ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా, సమక్క-సారలమ్మ తల్లుల త్యాగాల స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. అయితే మాస్టర్ ప్లాన్ డీపీఆర్ ఇంకా తుది రూపం దాల్చలేదని, దీనిపై అనవరసర రాద్ధాంతం చేయడం తగదని, రాజకీయాలు ఆపాదించడం సరికాదని హెచ్చరించారు. ఆదివాసీ సంస్కృతి, సమ్మక్క-సారలమ్మ పూజారుల విశ్వాసాలు, లక్షలాది భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే డీపీఆర్‌ను ఖరారు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మేడారం పర్యటన అనంతరం మాస్టర్ ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడిరచారు. ఈ ప్రక్రియలో ఆ దేవతల పూజారుల సూచనలు, రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటివారి ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. ఆదివాసీల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా, వారితో సంప్రదిస్తూ వారి మార్గదర్శకాల ఆధారంగానే మాస్టర్ ప్లాన్‌ను ఆమోదిస్తామని సీతక్క స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





