నోబెల్‌ బహుమతిని ట్రంప్‌కు అంజేసిన మచాడో

వాషింగ్టన్‌, జనవరి 16: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను వెనుజువెలా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో వైట్‌హౌజ్‌లో కలిశారు. ఈ సందర్భంగా తన నోబెల్‌ శాంతి బహుమతి పురస్కారాన్ని ట్రంప్‌కు అందజేశారు. సమావేశం అనంతరం ఈ విషయాన్ని మచాడో స్వయంగా విూడియాకు వెల్లడిరచారు. ఈ సందర్భంగా మచాడో మాట్లాడుతూ ’చరిత్రలో 200 ఏళ్ల తర్వాత బొలివర్‌ వారసులు వాషింగ్టన్‌ వారసుడికి ఒక పతకాన్ని తిరిగి ఇస్తున్నా.. ఇది మన స్వేచ్చ పట్ల ఆయన నిబద్ధతకు గుర్తింపుగా నా నోబెల్‌ శాంతి బహుమతిని ట్రంప్‌నకు అందజేస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన భార్యను అమెరికా సైనిక దళాలు అదుపులోకి తీసుకున్న కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మచాడోతో భేటీ అనంతరం ట్రంప్‌ స్పందిస్తూ ’మారియా కొరినా మచాడోను కలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆమె ఎన్నో కష్టనష్టాలను ఎదిరించి నిలిచిన గొప్ప మహిళ, ఇన్నాళ్ళు ప్రపంచ శాంతి కోసం నేను చేసిన కృషిని గుర్తించి ఆమె తన నోబెల్‌ పురస్కారాన్ని నాకు బహుమతిగా ఇచ్చారు.. థ్యాంక్యూ మరియా’ అంటూ తన ట్రూత్‌ సోషల్‌ వేదికగా ప్రకటించారు. తనకు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలని, దానికి తాను పూర్తి అర్హుడనని గత ఏడాది ట్రంప్‌ నానా హంగామా చేశారు. కానీ వెనుజువెలా ప్రతిపక్ష నేత కొరినా మచాడోకి దక్కింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *