హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) నూతన సంవత్సర డైరీని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ‘మా’ సభ్యుల కోసం చేపడుతున్న ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, హెల్త్ చెకప్‌లు, సభ్యుల సంక్షేమం కోసం ఇతర కార్యక్రమాలు అభినందనీయమని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ప్రజాభవన్‌లో సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ఉపాధ్యక్షుడు మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ జయవాణి, మలక్‌పేట్ శైలజ, శివనారాయణ, శశాంక్, హరనాథ్‌బాబు, మానిక్, సంపూర్ణేశ్‌బాబు, ఎం.ఆర్.సి. వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు మంచు విష్ణు, కార్యవర్గ సభ్యులను భట్టి అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





