– కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
ముంబై, ప్రజాతంత్ర, జనవరి 28: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మ తి చెందిన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ ప్రాథమిక వివరాలను వెల్లడించారు. ప్రమాద సమయంలో బారామతి విమానాశ్రయంలో విజిబులిటీ తగ్గినట్లు తేలిందని తెలిపారు. ల్యాండింగ్ సమయంలో రన్‌వే స్పష్టంగా కనిపిస్తుందా లేదా అని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు పైలట్లను ప్రశ్నించారని, రన్‌వే కనిపించడం లేదని వారు సమాధానం ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో భద్రతా కారణాల ద ష్ట్యా విమానం కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టినట్లు ఆయన చెప్పారు. అనంతరం రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే సమయంలో మళ్లీ రన్‌వే కనిపిస్తుందా అని ఏటీసీ ప్రశ్నించగా, పైలట్లు సానుకూలంగా సమాధానం ఇచ్చారని, దాంతో ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వగా ఆ క్షణాల్లోనే విమానం ప్రమాదానికి గురైందని తెలిపారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో లోతైన విచారణ చేపడతామని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత వాస్తవాలను ప్రజల ముందుంచుతామని తెలిపారు. ఇప్పటికే డీజీసీఏతోపాటు ఎయిర్‌క్రాప్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కి చెందిన ప్రత్యేక బృందాలు పుణెకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇదే అంశంపై డీజీసీఏ వర్గాలు కూడా స్పందించాయి. ల్యాండింగ్ సమయంలో రన్‌వేను స్పష్టంగా గుర్తించడంలో పైలట్లకు ఇబ్బందులు ఎదురైనట్లు తెలిపాయి. అయితే అత్యవసర పరిస్థితిని సూచించే మేడే కాల్స్ పైలట్ల నుంచి అందలేదని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందని, దర్యాప్తు పూర్తయ్యాకే ప్రమాదానికి గల అసలు కారణాలు తేలుతాయని అధికారులు చెబుతున్నారు.
రీడ్ బ్యాక్‌ను పట్టించుకోని పైలట్
విమానం ఉదయం 8.46 గంటలకు రన్‌వేకు 100 అడుగుల దూరంలో ప్రమాదానికి గురైనట్లు సీసీటీవీ ద శ్యాలను బట్టి వెల్లడైంది. దానికి 12 నిమిషాల ముందు ఏడీఎస్`బీ రేడియో సిగ్నళ్లను ప్రసారం చేయడం నిలిపివేసింది. వీటి ద్వారా ఎప్పటికప్ప్పుడు విమానం లొకేషన్, వేగం తెలుస్తుంది. ఈ ఘటన గురించిన వివరాలను వెల్లడిస్తున్న సమయంలో పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ’రీడ్‌బ్యాక్’ అనే పదం వాడారు. ల్యాండింగ్ క్లియరెన్స్ సమయంలో పైలెట్లు రీడ్‌బ్యాక్ చేస్తుంటారు. రీడ్‌బ్యాక్ అనేది ఒక ప్రొటోకాల్.. అందులో సందేశం ఏమీ ఉండదు. అయితే ల్యాండింగ్‌కు సంబంధించి అధికారిక అనుమతిని పొందే సమయంలో దీనిని వాడతారు. రీడ్‌బ్యాక్ అంటే ఒక సందేశాన్ని మళ్లీ చదవడమే. అంటే ఎయిర్‌క్రాప్ట్ సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య సమన్వయ లోపం లేదని ఇది నిర్దారిస్తుంది. ల్యాండింగ్ అవుతున్నప్ప్పుడు ఈ రీడ్‌బ్యాక్ చాలా కీలకం. ఏ రన్‌వేను ఉపయోగించాలి..వాతావరణం ఎలా ఉంది.. విమానం వేగం,ఎత్తు మార్చుకున్నప్ప్పుడు.. విమానం ల్యాండ్ అయ్యే ప్రాంతంలో ట్రాఫిక్ ఎలా ఉందనే విషయాలపై పైలట్, ఏటీసీ మధ్య కమ్యూనికేషన్‌కు ఇది ఉపయోగపడుతుంది. అయితే తాజా ఘటనలో లియర్‌జెట్ పైలట్ శాంభవి పాఠక్.. ఈ రీడ్‌బ్యాక్ ఇవ్వలేదు. రన్‌వే కనిపిస్తుందా? లేదా అని పైలట్లను బారామతి ఏటీసీ అధికారులు అడిగారని, కనిపించడం లేదనే సమాధానం వచ్చిందన్నారు. దాంతో విమానం గాల్లో కొంతసేపు చక్కర్లు కొట్టినట్లు కేంద్ర మంత్రి వివరించారు. రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే సమయంలో రన్‌వే కనిపిస్తుందా? అని ఏటీసీ అడిగినప్ప్పుడు పైలట్లు సానుకూలంగా స్పందించారని తెలిసిందన్నారు. దీంతో ల్యాండింగ్ కోసం ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చిందని.. ఆ వెంటనే విమానం కూలిపోయిందన్నారు. శాంభవి.. న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో కమర్షియల్ పైలట్ శిక్షణ తీసుకుని లైసెన్స్ పొందారు. ఆ తర్వాత భారత్‌కు వచ్చి డీజీసీఏ నుంచి కమర్షియల్ పైలట్ లైసెన్స్‌తో పాటు ఫ్రోజెన్ ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్ కూడా పొందారు. కొత్త పైలట్లకు శిక్షణ ఇచ్చేలా అసిస్టెంట్ ఫ్లైట్ ఇన్ స్ట్రక్టర్‌గానూ పనిచేశారు. 2022 ఆగస్టు నుంచి వీఎస్‌ఆర్ వెంచర్స్ పైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫుల్ టైమ్ ఫస్ట్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





