విషాదాంతం అయిన ప్రేమజంట జీవితం

– ఉరేసుకుని ప్రేమికురాలు బలవన్మరణం
– తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 7: ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక ప్రియుడు నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న‌ ఘటన హయత్‌నగర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని బ్రాహ్మణపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో పూజ అనే 17 ఏళ్ల యువతి మంగళవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తమ బిడ్డ ఆత్మహత్యకు కారణం అదే గ్రామానికి చెందిన సిద్దగోని మహేష్‌ అని మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహేష్‌ ‌కూడా బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివ‌రాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని మేడిపల్లిలో పోతురాజు అలివేలు కూతురు పోతురాజు పూజ (16) అనే విద్యార్థిని ఇబ్రహీంపట్నంలోని కార్తికేయ కళాశాలలో ఇంటర్‌ ‌ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. పూజ‌ తండ్రి పదహారేళ్ల క్రితం మృతి చెందడంతో అప్పటినుంచి అలివేలు కుమారుడు, కుమార్తెను పెంచి పోషించింది. అదే గ్రామానికి చెందిన సిద్ధగోని యాదయ్య కుమారుడు సిద్ధగోని మహేష్‌ (20), పూజ‌ ‌నాలుగు ఐదు నెలలుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. విషయం ఇరు కుటుంబాల్లో తెలవడంతో వీరిని కొన్ని రోజులుగా కలుసుకోకుండా చేశారు. దీంతో ఇటీవలే మహేష్‌ ‌పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కొన్ని రోజులు దవాఖానాలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు. మహేష్‌ ‌పురుగుల మందు తాగిన విషయాన్ని తెలుసుకున్న పూజ సైతం మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. ఆమె సైతం ప్రాణాలతో బయటపడింది. పెళ్లి చేసుకోకుంటే చస్తానని మహేష్‌ ‌ఫోన్‌ ‌చేసి చెప్పడంతో పూజ మానసిక ఒత్తిడికి గురైంది. తన ప్రియుడు ఆత్మహత్య చేసుకుంటాడేమోనని దిగులుతో మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల రంగప్రవేశంతో పూజ మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం మార్చురికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పూజ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న మహేష్‌ ‌బుధవారం బ్రాహ్మణపల్లె సమీపంలో ఒంటిపై పెట్రోల్‌ ‌పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అటు పూజ ,ఇటు మహేష్‌ కుటుంబాలలో రోదనలు మిన్నంటాయి. పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *