– ఆత్మహత్యాయత్నం.. యువకుడి మృతి
సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 31: ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న జంట పెద్దల నిరాకరణతో ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాలలో చోటుచేసుకుంది. ముస్త్యాలకు చెందిన అనుముల రాకేశ్(30) కారు డ్రైవర్. అదే గ్రామానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. కొంతకాలంగా వీరు ప్రేమించుకున్నారు. రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. విషయం బయటకు పొక్కడంతో ఇద్దరివీ వేర్వేరు సామాజికవర్గాలు కావడంతో వారి పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు. వివాహం చేసే వరకు కొంత గడువు కావాలని, పెద్దల సమక్షంలో వివాహం జరుపుతామని యువతి సోదరి హామీ ఇవ్వడంతో ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. రోజులు గడుస్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా హాస్పిటల్‌లో కోలుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రాకేశ్‌తోపాటు అతడి కుటుంబీకులను విచారించారు. మనోవేదనకు గురైన రాకేశ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా హైదరాబాద్‌లోని ఓ పైవేటు హాస్పిటల్‌లో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించగా సోమవారం రాత్రి మృతిచెందాడు. రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఇరువురూ తెలిపారని, రాకేశ్ తల్లిదండ్రుల నిరాకరణతో ప్రేయసి ఇటీవల ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



