గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌కాదు.. యూరియా సంగతి చూడండి

-ఉత్తర కుమార ప్రగల్భాలకు పరిమితమైన రేవంత్‌
-‌విమర్శలు చేసిన మాజీమంత్రి హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 6 : రాష్ట్రంలో యూరియా కష్టాల నేపథ్యంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌ ‌రావు మండిపడ్డారు. నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్‌ ‌మండలం ధర్మరావు పేట గ్రామంలో యూరియా కోసం రైతులు పడుతున్నఅగచాట్లు ఇవి అని ఒక వీడియోను సోషల్‌‌డియా వేదికగా పోస్టు చేశారు.రైతులకు యూరియా సరఫరా చేయడం చేతగాని రేవంత్‌ ‌రెడ్డి, ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిండని హరీశ్‌రావు మండిపడ్డారు. విజయోత్సవాల పేరిట ప్రభుత్వ ధనం దుబారా చేస్తూ.. చేసింది లేక, చెప్పకునేది లేక గప్పాలు కొట్టిండని విమర్శించారు. గ్లోబల్‌ ‌సమ్మిట్‌ అం‌టూ, విజన్‌ 2047 అం‌టూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న రేవంత్‌ ‌రెడ్డి , ముందు రైతులకు యూరియా సరఫరా చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ ప్రణాళికను గాలికి వదలి రైతులు, మహిళలు, వృద్దులు అందర్నీ యూరియా కోసం గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబెడే పరిస్థితి తెచ్చావని సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై హరీష్‌ ‌రావు మండిపడ్డారు.  దుర్మార్గ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు.  రైతు వ్యతిరేక విధానాతో రైతులు నరకం చూస్తున్నారని అన్నారు. గత సీజన్‌ ‌యూరియా కష్టాలు, చేదు అనుభవాల నుంచి మీరు,  ప్రభుత్వం ఏం నేర్చుకోకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. సీజన్‌ ‌ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే, మున్ముందు పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉంటుంది? అని ప్రశ్నించారు. యూరియా కొరత రాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *