పవన్‌.. ఆం‌ధ్రా రాజకీయాలు చూసుకో

– తెలంగాణను అవమానించిన నీకు ఇక్కడేం పని
– టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌ ‌ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 4: పవన్‌ ఒక ఆంధ్ర నాయకుడని, ఆయన తెలంగాణ వ్యతిరేకి అని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌ ‌ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు పవన్‌ ‌కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ ‌తన రాజకీయాలను ఆంధ్రాలోనే చేసుకోవాలని, తెలంగాణలో ఆయన ప్రచారం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా పవన్‌ ‌కల్యాణ్‌ ‌ప్రచారం చేస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మహేశ్‌ ‌గౌడ్‌ ‌వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గతంలో పవన్‌ ‌తెలంగాణ గురించి చాలా నీచంగా మాట్లాడారు. బీజేపీ నేతలు పవన్‌ ‌కల్యాణ్‌ను భిక్షాందేహీ అని అడిగారు అని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో పవన్‌ ‌తెలంగాణ గురించి చాలా నీచంగా మాట్లాడారని, అలాంటి వ్యక్తి మాటలు విని ఇక్కడి ప్రజలు ఓట్లు వేయరని అన్నారు. ఆయన మాటలను ఎవరూ విశ్వసించరని, ఆయన ప్రభావం తెలంగాణ రాజకీయాలపై శూన్యమని మహేష్‌ ‌గౌడ్‌ ‌స్పష్టం చేశారు.గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ వ్యక్తుల గురించి, భాష, సంస్కృతి గురించి దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. అందుకే పవన్‌ ‌ను దిష్టి కల్యాణ్‌ అని అంటామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కోరుకుంటున్నారుని.. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వారికి సంక్షేమం, అభివృద్ధి ఇస్తుందని అన్నారు. అందుకే రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో 90 శాతానికిపైగా మున్సిపాలిటీలు కాంగ్రెస్‌ ‌గెలుచుకునే అవకాశం ఉందన్నారు. ఆ భయంతో పవన్‌ ‌కల్యాణ్‌ ‌లాంటి సినీ తారలను బీజేపీ నాయకులు అడుక్కునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. పవన్‌ ‌కల్యాణ్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. ఆంధ్రాలో రాజకీయాలు చేసుకుంటే మంచిదని పీసీసీ చీఫ్‌ ‌సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *