– ఇద్దరు హైదరాబాద్ యువకుల మృతి
– హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2ః యునైటెడ్ కింగ్‌డమ్(లండన్)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో హైదరాబాద్‌కు చెందిన రిషితేజ(21) , చైతన్య అనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరంతా హాస్పిటల్‌లో చికిత్సపొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. గణపతి నిమజ్జనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మృతులలో రిషితేజ హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన వాడు కాగా చైతన్య నాదర్‌గుల్ వాసి. వీరిద్దరూ ఉన్నత విద్య కోసం యూకేకు వెళ్లారు. పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్న వారి తల్లిదండ్రులకు ఈ వార్త ఊహించని షాక్ ఇచ్చింది. సమాచారం తెలియగానే వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





