లోక్ సభ ప్రత్యేక స్పీకర్ గా జగదాంబికా పాల్

– స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం.. చర్చ ప్రారంభం
– విపక్ష నేత మాట్లాడేందుకు నిరాకరించారని కాంగ్రెస్ ఎంపీ జావెద్ ఆరోపణ
– కాంగ్రెస్ సంప్రదాయాలు పాటించడం లేదు: కిరణ్ రిజిజు
– నెహ్రూను తిట్టేవారు ఆయనను జపిస్తున్నారు: ప్రియాంక

న్యూదిల్లీ, మార్చి 10: లోకసభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం గురించి లోక్సభలో చర్చ ప్రారంభమైంది. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్ లోక్సభలో మంగళవారం ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభమైంది. ఈ చర్చ కోసం పది గంటల సమయం కేటాయించారు. అనంతరం తీర్మానంపై వోటింగ్ నిర్వహించనున్నారు. స్పీకర్ ఓం బిర్లా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, ఆయన అధికార పార్టీ భాష మాట్లాడుతున్నారని తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్ ఆరోపించారు. అనంతరం అవిశ్వాస తీర్మానంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చర్చను ప్రారంభించారు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం గురించి చర్చ జరుగుతున్న సమయంలో సభను నడిపేందుకు ప్రత్యేక సభాపతిని నియమించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ కు కేంద్రం అంగీకరించింది. సీనియర్ ఎంపీ, చైర్ పర్సన్స్ ప్యానెల్ సభ్యుడు జగదాంబికా పాల్ ను నియమించింది. ఆయన నేతృత్వంలో ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టారు. ప్రతిపక్షాల తరపున కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం సహా పలు అంశాలపై లోక్సభప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడేందుకు యత్నించారని, కానీ స్పీకర్ అనుమతినివ్వలేదని అన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి లోక్సభలో సుమారు 200మంది సభ్యులున్నప్పటికీ.. డిప్యూటీ స్పీకర్ లేరని అన్నారు. డిప్యూటీ స్పీకర్ లేకుండా సభ ఎలా నడుస్తుందో దేశ ప్రజలు చూడాలని అన్నారు. మైక్ని కూడా ఆయుధంగా వినియోగి స్తున్నారని అన్నారు. ఎన్డీఎ సభ్యులకు మాట్లాడేందుకు అనుమతినిస్తున్నారని, కానీ ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు మైక్ని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని అన్నారు. అయితే రాహుల్ సభలో హుందాగా మెలగడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఈ క్రమంలో గతంలో ప్రధాని మోదీని రాహుల్ ఆలింగనం చేసుకున్న ఘటనను ప్రస్తావించారు. ప్రధాని మోదీ దగ్గరకు దగ్గరకు వచ్చిన రాహు ల్.. ఆలింగనం చేసుకొని వెళ్లి తన సీట్లో కూర్చున్నారు. అనంతరం తోటి ఎంపీలను చూసుకుంటూ కళ్లు ఎగరవేశారు. అటువంటి నేతను ఎప్పుడూ చూడలేదు అని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *