దేవస్థానంలో స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి

– న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుంది..

– పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 2: యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిలో భాగంగా ఎంతోమంది ఇండ్లు ప్లాట్లు భూములు కోల్పోయిన వారికి అన్యాయం జరిగింద‌ని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య , పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్ తెలిపారు. పార్టీ ప‌ట్ట‌ణ‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. యాదగిరిగుట్ట కొండపైన ఎన్నో ఏండ్లుగా వర్తక సంఘం పేరుతో వ్యాపారాలు కొనసాగిస్తూ కేవలం కొద్దిమంది చేతికే పరిమితమై మిగతా నిరుద్యోగులకు ఉపాధి దొరకకపోవడంతో కేవలం రూ.10000 జీతానికి నిరుద్యోగ యువకులు రోజూ హైదరాబాద్ వెళ్లి వస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వర్తక సంఘంలో ఉన్న వ్యాపారులు ఎన్నో ఏండ్లుగా టెండర్ వేయకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారంటూ ఆ షాపులను రద్దు చేస్తూ కొత్తవారికి అవకాశం కల్పిస్తూ స్థానిక నిరుద్యోగులకు షాపులు కేటాయిస్తూ భూములు, ఇండ్లు కోల్పోయిన వారికి కొంత శాతం కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు దీని ద్వారా దేవస్థానానికి ఆదాయం పెరగడమే కాక ఎంతో మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగం కల్పించినట్లవుతుంద‌న్నారు. గ్లోబల్ టెండర్ విషయంలో కూడా ఎక్కువగా స్థానికేతరులను ఎమ్మెల్యే , ఎంపీ లెటర్ తో నియామకం చేశార‌ని, ఆ గ్లోబల్ టెండర్ రిక్రూట్మెంట్ లో కూడా స్థానికులకు కేటాయించాల‌ని, ఎన్నో ఏండ్లుగా స్వామివారిని నమ్ముకుని లబ్ధి పొందినందుకు ఈ వర్తక సంఘం లో ఉన్నటువంటి పెద్ద మనుషులు స్వచ్ఛందంగా తప్పుకొని పేదవారికి అవకాశం ఇస్తే బాగుంటుందని అన్నారు. స్థానిక ప్రజలకు న్యాయం కోసం, వాళ్ళ ఉద్యోగ ఉపాధి కల్పన కోసం త‌మ‌ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. స‌మావేశంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆకుల చంద్రమౌళి, మండల మాజీ అధ్యక్షుడు గుంటుపల్లి సత్యం, పట్టణ ప్రధాన కార్యదర్శి మందోజు నరేష్ , జిల్లా భానుచందర్ ,కార్యదర్శి దొమ్మాట ప్రభాకర్, సురేష్, సీనియర్ నాయకులు తాళ్ల భాస్కర్ రెడ్డి , రంగసత్యం , భువనగిరి శ్యాంసుందర్ , బందారం మల్లేష్ గౌడ్ , నంగునూరు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *