‘స్థానికత’పై తీర్పును రిజర్వు చేసిన సుప్రీం
న్యూదిల్లీ, ఆగస్టు 5: తెలంగాణ స్థానిక కోటాపై సుప్రీంకోర్టులో మంగళవారం కీలక విచారణ జరిగింది. స్థానికులు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదవకపోయినా స్థానిక కోటా వర్తిస్తుందన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం చారణ చేపట్టింది. పదో తరగతి తర్వాత రెండేళ్లు బయట చదివితే స్థానికత వర్తించదన్న ప్రభుత్వ ఉత్తర్వులపై పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. 10వ తరగతి వరకు చదువుకుని రెండేళ్లు యటకు వెళితే తప్పేమిటని సీజేఐ ప్రశ్నించారు. రెండేళ్లు బయటకు వెళ్లిన విద్యార్థులకు అన్యాయం చేయరాదని సీజేఐ గవాయ్ వ్యాఖ్యానించారు. విద్యార్థి తెలంగాణలో పుట్టి, చదివి రెండేళ్లు కోట, దుబాయ్ లాంటి ప్రాంతాలకు ఇంటర్ చదువుకోడానికి వెళ్లిన విద్యార్థులకు కోటా వర్తించదంటే ఎలా అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఎటూ స్థానిక కోటా కిందకు రారని స్పష్టం చేశారు. నాలుగేళ్ల చదువు లేదా నివాసం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానికత ఖరారు చేసిందని ప్రభుత్వం తరఫున న్యాయవాది సింఫ్వీు న్యాయస్థానానికి వివరించారు. 2024లో తీసుకొచ్చిన నిబంధనను 2028కి వర్తింపజేస్తే సరిపోతుందని సీజేఐ పేర్కొన్నారు. వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వు చేసినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.




