– హామీలను గుప్పిస్తూ సొంత ఎజెండాలతో కరపత్రాలు
– తొలి విడతలో రాత్రివేళ్లలోనూ వోట్లు అభ్యర్థన
ఆదిలాబాద్,ప్రజాతంత్ర,డిసెంబరు 10: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారంతో తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారం ఉదయం తొలివిడత ఎన్నికల పోలింగ్ పక్రియ ప్రారంభంకానుంది. తొలి విడత కింద 6 మండలాల పరిధిలో 166 గ్రామ పంచాయతీలు, 1390 వార్డు మెంబర్ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అభ్యర్థులు వోటర్ల మద్దతు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సొంతంగా మేనిఫెస్టోలను రూపొందిస్తూ.. ప్రచారం చేపట్టడం విశేషం. ఒప్పంద పత్రాలు, బాండ్ పేపర్లను రాసి ఇస్తున్న వైనం గతంలో ఎప్పుడూ లేదు. వివిధ రకాల ప్రలోభాలతో వోటర్లకు ఎర వేస్తున్నారు. ప్రశాంతంగా ముగిసిన తొలివిడత ఎన్నికల ప్రచారం ముగియడంతో రాత్రి వేళల్లో నేరుగా కలుసుకుని వోటును అభ్యర్థించారు. పంచాయతీ ఎన్నికల్లో వోట్లను రాబట్టేందుకు అభ్యర్థులు దేనికైనా తగ్గేదే లేదంటున్నారు. అప్పులు చేసి మరీ ఎన్నికల్లో నెగ్గేందుకు సిద్ధమవుతున్నారు. తొలివిడత ఎన్నికలు జరగే గ్రామాల్లో అభ్యర్థులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అభ్యర్థులు ప్రధాన పార్టీల మద్దతుతో గెలిచేందుకు ప్లాన్ చేస్తున్నారు. మద్దతు ఇచ్చి గెలిపిస్తే ఊరిని బాగు చేస్తామని హాలు గుప్పిస్తున్నారు. అయితే 15 రోజులుగా సాగిన మొదటి విడత ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. అభ్యర్థులందరూ స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా మురుగునీటి కాలువల నిర్మాణం, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, పారిశుధ్యం, అసంపూర్తిగా ఉన్న ఆలయాలు, కుల సంఘ భవనాల నిర్మాణం పనులపై హామీలు ఇస్తున్నారు. అలాగే తమను గెలిపిస్తే గ్రామాల్లో చేపట్టే పనులకు సంబంధించిన వివరాలను సోషల్ డియాలో జోరుగా వైరల్ చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.