– కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు
– ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్‌దే తుది నిర్ణయం
– కెసిఆర్ కుటుంబంలో అంతర్గత కలహాలకు కవిత బలి
– కాళేశ్వరంపై సిబిఐ విచారణలో కిషన్ రెడ్డి మోకాలడ్డు
– మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేంవత్ రెడ్డి వ్యాఖ్యలు
– సిఎంతో భేటీ అయిన న్యూజెర్సీ గవర్నర్
న్యూదిల్లీ, సెప్టెంబరు 19: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం దిల్లీలో డియాతో సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్ చేశారు. సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక ఎన్నికలు జరపడం కష్టమని తెలిపారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైనా స్పందించారు . కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల జీతాల నుంచి రూ.5000లు ఆ పార్టీకే వెళ్తుందని అన్నారు. నిధులు సైతం బీఆర్‌ఎస్‌కే వెళ్తున్నాయని తెలిపారు. అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ తమకు 37 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, సమయం కేటాయించాలని కోరారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్, బీజేపీ, ఇతర పార్టీలకు సంబంధించిన పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కలహాలు ఉన్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తును కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కలిసి ఒక ఆడపిల్ల (కవిత)పై దాడి చేయాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది వారి కుటుంబ సమస్య అని, దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నేను ఎక్కడా కవితకు సపోర్ట్ చేయడం లేదు. ఇది వారి ఇంటి సమస్య. ఆస్తి తగాదాల వల్ల వారి కుటుంబ సమస్యలు బజారున పడ్డాయి. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని తిరస్కరించారు. ఆ నలుగురిని తెలంగాణ ప్రజలు బహిష్కరించారని రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు చేయిస్తామని గతంలో కిషన్ రెడ్డి చెప్పారని, కానీ ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో దర్యాప్తు జరుపుతామని కిషన్ రెడ్డి గతంలో చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎందుకు మాట్లాడటం లేదు? కేటీఆర్ ఏం చెబితే కిషన్ రెడ్డి అది చేస్తారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే అన్ని వివరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ కేసు నుంచి సీబీఐ మొదటి నుంచి దర్యాప్తు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయి. కాళేశ్వరం సీబీఐ విచారణ జరపకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో రైలుపై మాట్లాడుతూ, ఎల్ అండ్ టి తీసుకునే నిర్ణయాలపై ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. ‘ఎల్ అండ్ టి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పని చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎల్ అండ్ టితో ఒప్పందం కుదుర్చుకోవాలని చెబుతోంది. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం బయటకు పోతుందని ఎక్కడ చెప్పలేదని రేవంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ నియంత్రణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డ్రగ్స్‌ను కంట్రోల్ చేస్తున్నాం. మా ఈగల్ టీం గోవా వెళ్లి డ్రగ్స్‌తో సంబంధం ఉన్నవారిని పట్టుకుంది. హైదరాబాద్‌లో దొరికిన డ్రగ్స్ తయారీ కంపెనీ గత ప్రభుత్వంలోనే ఏర్పడింది. కేటీఆర్ బామ్మర్ది ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌తో దొరికారని ఆరోపించారు. 2014-19 మధ్య టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, చట్టసభల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు. హరీష్ రావే మాకు 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అసెంబ్లీలో చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రాష్ట్రానికి 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ప్రస్తుతం 2 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఉంది. బీజేపీ, టీఆర్‌ఎస్ ఈ విషయంలో రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మావోయిస్టులు లొంగిపోవడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పాలసీలు తీసుకొచ్చాయని చెప్పారు. టెర్రరిస్టులతో చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పుడు, నక్సలైట్లతో చర్చలు చెప్పడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. లోకేష్ నాకు తమ్ముడు లాంటివాడు అని కేటీఆర్ చెప్పారు. మరి తమ్ముడు లోకేష్ తండ్రిని జైల్లో పెట్టినప్పుడు కేటీఆర్ ఎక్కడ ఉన్నాడని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. 2047 నాటికి తెలంగాణ ప్రాధాన్యత రంగాలను వివరించారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ప్రైవేటు రంగం మద్దతు గురించి తెలిపారు. అభివృద్ధి కోసం ‘తెలంగాణ రైజింగ్ 2047’ రూపొందించుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో కోటి మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. నగరంలో ఆర్‌ఆర్‌ఆర్ కూడా నిర్మిస్తున్నాం. ప్రస్తుతం 70 కిలోటర్లు ఉన్న మెట్రోను 150 కిలోటర్లకు విస్తరిస్తున్నాం. మెట్రోలో ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఆ సంఖ్యను 15 లక్షలకు పెంచాలనేదే మా లక్ష్యం. గుజరాత్‌లోని సబర్మతీ తీరంలా మూసీ తీరాన్ని అభివృద్ధి చేస్తాం. దీనికోసం మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. కాలుష్య కారక పరిశ్రమలను హైదరాబాద్ వెలుపలకు తరలిస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం అన్నారు.
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తున్నాం. విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. తెలంగాణ గ్రాణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం. డ్రగ్స్ కట్టడిలో మా రాష్ట్ర పోలీసులు దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నారు. 2034 కల్లా ట్రిలియన్ డాలర్ల, 2047 కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానగా మారాలనేది మా లక్ష్యం. దేశ జీడీపీలో 10 శాతం తెలంగాణ నుంచే రావాలనేది మా ధ్యేయం అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇదిలావుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్ పిలిప్ డి.ముర్పీ దిల్లీలో శుక్రవారం భేటీ అయ్యారు. విద్యా, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్, మౌలిక వసతులు, మూసీ రివర్ ఫ్రంట్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి… న్యూజెర్సీ గవర్నర్ చర్చించారు. తెలంగాణ విజన్ 2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి వివరించారు. ఐటీ-, ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రాధాన్యాన్ని సీఎం తెలియజేశారు. భేటీలో గవర్నర్ సతీమణితో పాటు న్యూజెర్సీ ప్రతినిధులు పాల్గొన్నారు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





