‘స్థానిక’ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత

హైదరాబాద్,ప్రజాతంత్ర, నవంబరు 22: తెలం గాణ లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై జరుగుతున్న చర్చకు రేవంత్ సర్కార్ తెర దిం పింది. తాజాగా ఇందుకు సంబంధించిన జీ.ఓ.ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. రిజ ర్వేషన్ల ఖరారు కోసం పంచాయతీ రాజ్ శాఖ జీ. ఓ. విడుదల చేసింది. పంచాయతీరాజ్ జీ.ఓ. ప్రకా రం రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్లు ఖరారు చేయ నున్నారు. 50శాతం రిజర్వేషన్లు దాటకుండా ఎ స్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నిర్ణ యం తీసుకుంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీ.ఓ. ప్రకారం బీసీలకు సర్పంచ్, వార్డు స్థానాల్లో 23 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. ఇదిలావుంటే వొచ్చే వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లా స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లు, అధికారులు చేపట్టాల్సిన బాధ్యతలు, భద్రతా చర్యలు, పోలింగ్ ఏర్పాట్లపై ఈ సమావేశంలో స్పష్టమైన మార్గద ర్శకాలు ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నిక లు సమీపిస్తున్న నేపథ్యంలో, ఈసీ చర్యలు అధికార యంత్రాంగాన్ని ఉత్సాహపరుస్తున్నా యి. మరోవైపు.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వ హణకు సంబంధించిన సన్నాహాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డైరె క్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డిలతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సం దర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ..ప్రతి జిల్లాలో ఎన్నిక లను మూడు దఫాలు గా నిర్వహించాలని ప్రతి పాదించారు. ఒక ప్రాంతం లోని ఎన్నికలు పూ ర్తయిన తర్వాత, మరొక ప్రాంతంలో ఎన్నిక లకు మధ్యలో రెండు రోజుల విరామం ఉండా లని డీజీపీ అభిప్రాయపడ్డారు. ఈ విరామం వలన సిబ్బందికి, భద్రతా బలగాలకు తగిన సమయం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page