కావాలనే రిజర్వేషన్లపై బీజేపీ రాద్ధాంతం : పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 9: బీసీల రిజర్వేషన్లపై బీజేపీ కావాలనే రాద్ధాంతం చేస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే స్థానిక ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని తమ ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు బీజేపీ నేతలు మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు కావాలనే వారు రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.



