గడ్డి మందుతో ప్రాణాలు పోతున్నాయ్‌

– దానిని వెంటనే నిషేధించాలి
– మాజీ ఎంపి బి.వినోద్‌ ‌డిమాండ్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: మనుషుల ప్రాణాలను హరిస్తున్న పారాక్విట్‌  ‌డిక్లోరైడ్‌ ‌గడ్డి మందు వాడకుండా నిషేధం విధించాలని, దీనిపై ప్రభుత్వం ఆలోచన చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ ‌కుమార్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ప్రతి నెలా ఈ మందు తాగి పదుల సంఖ్యలో కరీంనగర్‌, ‌వరంగల్‌ ‌జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరి మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందని అన్నారు. ఈ మందుకు విరుగుడు మందు లేకపోవడం వల్ల తాగిన వ్యక్తులు చనిపోతున్నారని పేర్కొన్నారు. పారాక్వాట్‌ ‌డిక్లోరైడ్‌ ‌వాడకాన్ని ఒడిశా ప్రభుత్వం ప్రతి ఆరు నెలలపాటు నిషేధిస్తూ వస్తోందని, ప్రపంచంలో 70 దేశాలు ఈ గడ్డి మందును నిషేధించాయని వెల్లడించారు. పారా క్విట్‌ ‌డై క్లోరైడ్‌ను నిషేధించాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి, సీఎస్‌ ‌రామకృష్ణారావు, రైతు కమిషన్‌ ‌చైర్మన్‌ ‌కోదండరామ్‌ ‌రెడ్డి, ఇండియన్‌ ‌మెడికల్‌ అసోసియేషన్‌ ‌చైర్మన్‌ ‌డాక్టర్‌ ‌కిషన్‌కు లేఖ రాశామని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో పారా క్విట్‌ ‌డై క్లోరైడ్‌ ‌గడ్డి మందు తాగి ఎక్కువమంది చనిపోతున్నారని కొందరు వైద్యులు కూడా వెల్లడించారు. ఈ గడ్డి మందు వాడకంపై గ్రామాల్లో తిరిగి ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామని, దీనిని నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు. ఈ గడ్డి మందు తాగి బ‌తికేవాళ్లు సైతం సైడ్‌ ఎఫెక్ట్స్‌తో చనిపోతున్నారని వివరించారు. గడ్డి మందును వాడిన తర్వాత మిగిలిన మందును రైతులు దాచుకోవద్దని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *