– ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధింపు
న్యూదిల్లీ, మార్చి 26: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. అతడికి అందించిన భోజనంలో పురుగులు కనిపించాయి. దీంతో రైల్వే శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధించింది. పట్నా-టాటానగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన రితేష్ కుమార్ అనే ప్రయాణికుడికి ఈ అనుభవం ఎదురైంది .రితేష్ కుమార్ మార్చి 15వ తేదీన పట్నా-టాటానగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఆ సమయంలో రితేష్‌కు అందించిన భోజనంలోని పెరుగులో పురుగులు కనిపించాయి. దీంతో షాకైన రితేష్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. రైల్వే సిబ్బంది కూడా ఆ భోజనాన్ని పరిశీలించారు. ఈ మొత్తం తతంగాన్ని రితేష్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. వీడియోపై రైల్వే మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షలు జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. అలాగే ఆ రైల్లో కేటరింగ్ చేసిన ఫుడ్ సర్వీస్ ప్రొవైడర్‌కు రూ.50 లక్షల జరిమానా విధించడంతో పాటు అతడి కాంట్రాక్టును కూడా రద్దు చేసింది. రైల్వే ప్రయాణికుల భద్రతకే తమ మొదటి ప్రాధాన్యం అని తేల్చి చెప్పింది.
——————————————————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




