– ప్రముఖ తమిళ కవయిత్రి సకీర్తరాణి
– ఘనంగా విరసం 30వ మహాసభలు ప్రారంభం
కాళోజీ జంక్షన్/హైదరాబాద్ప్ర, జాతంత్ర, జనవరి 24: సాహిత్యకారులు తమ సాహిత్యానికి రెండు అంచుల పదును ఉండేలాగా సృజనాత్మక రచనలు చేయాలని ప్రముఖ తమిళ రచ యిత్రి సుకీర్త రాణి పిలుపునిచ్చారు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విరసం అధ్యక్షుడు అరసవల్లి కృష్ణ అధ్యక్షతన విరసం 30వ మహాసభలకు సుకీర్తరాణి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రచయితలు తాము చేసే రచనలు దోపిడీ పాలకుల తప్పు లను ఎత్తి చూపడమే కాకుండా ప్రజల్ని చైతన్య పరిచే విధంగా ఉండాలని కోరారు. పీడిత వర్గాల పట్ల పాలకులు అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని కోరారు. రచనలు సామా జిక మార్పుకు మార్గదర్శకత్వం వహించాలని కోరారు. సృజన కారులు నిరంతరం సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని కోరారు. తమకు జ్ఞానం ఇచ్చిన ప్రజల కోసం రాయడమే నిజ మైన సృజన అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా హెచ్చరిల్లుతున్న హిందూ ఫాసిస్టు మతోన్మాదా న్ని తుద ముట్టించేందుకు ప్రజాస్వామిక వాదు లంతా ఐక్య సంఘటన నిర్మించాలని కోరారు. కార్పొరేట్ దిగ్గజం ఆదాయాన్ని అందించే సాహిత్య అవార్డును తిరస్కరించినట్టు చెప్పారు. అవార్డు తిరస్కరణతో కేంద్ర విచారణ సంస్థలు తనపై మరింత నిగా పెంచేయాలి ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన మహాసభలలో ప్రసం గించే అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె హర్షం వ్యక్తం చేశారు. వర్తమాన భారత దేశ పరిస్థితులపై “స్వేచ్ఛ పతాక” అనే కవితను ఆమె చదివి వినిపించారు. కార్యక్రమంలో విరసం కార్యవర్గ సభ్యుడు శివరాత్రి సుధాకర్, కార్యదర్శి రివేరా, పాణి, టీ వరలక్షి, సిఎస్ఆర్ ప్రసాద్ పాల్గొని ప్రసంగిం చారు. సభల ప్రారంభం సందర్భంగా తొలుత అరుణ పతాకాన్ని సీనియర్ సభ్యులు వి. చెంచయ్య ఆవిష్కరించి కళాకారులు ఆటపా టలతో సభ ప్రాంగణాన్ని ఉత్తేజపరిచారు. సమావేశంలో వందేళ్ల కమ్యూనిస్టు చరిత్రపై “అరుణతార” ప్రత్యేక సాహిత్య సం చికను ఆవి ష్కరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





