తెలంగాణ సాహితీవేత్త, రచయిత కొంపెల్లి మృతి

– సంతాపం తెలిపిన కేసీఆర్‌, కేటీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25:తెలంగాణ సామాజిక సాహితీవేత్త, ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్‌ గౌడ్‌ మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌తో సంభాషణ, వొడువని ముచ్చట పుస్తకం ద్వారా రాష్ట్ర సాధన కోసం అనుసరించాల్సిన రాజకీయ భావజాలాన్ని వ్యాప్తిచేసిన ఉద్యమ రచయిత కొంపెల్లి అన్నారు. సర్దార్‌ సర్వాయి పాపన్న చరిత్రను రికార్డు చేసి వెలుగులోకి తెచ్చి బీసీల రాజకీయ చైతన్యం కోసం పాటుపడ్డారంటూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. తెలంగాణవాదిగా, బహుజన వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ పలు రచనలు చేసిన వెంకట్‌ గౌడ్‌ అకాల మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. శోకతప్తులైన ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులకు కేసీఆర్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, వెంకట్‌ లేరన్న వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *