– మంచు లక్ష్మి ఫౌండేషన్ కార్యక్రమంలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: అక్షర జ్ఞానమే శక్తివంతమైన ఆయుధమని, సమాజంలో అంతరాలు పొవాలంటే చదువు ముఖ్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. మంచి మనుసుతో మంచు లక్ష్మి టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. హైటెక్స్‌లోని హెచఐసీసీలో సినీ నటి మంచు లక్ష్మి ఫౌండేషన్ టీచ్ ఫర్ ఛేûంజ్ కార్యక్రమంలో మంత్రి ఆమె పాల్గొన్నారు. కరోనా కాలంలో సూర్యోదయం కాకుండానే సరకులు తీసుకుని అడవుల్లోకి వెళ్ళేవాళ్లమని, కొండలు, వాగులు దాటుకుని ప్రజలను చేరుకునేవాళ్లమని గుర్తు చేస్తూ ఆ సమయంలో తమ సేవలకు మంచు లక్ష్మి సహకారం అందించారని చెప్పారు. పేరులోనే కాదు ఆమెలో మంచి, మానవత్వం ఉన్నాయంటూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనవంతు సహకారంగా పేదలకు అక్షర జ్ఞానాన్ని పెంపొందిస్తున్న ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరయ్యానని మంత్రి సీతక్క అన్నారు. పేద పిల్లలకు ఆంగ్లం, సాంకేతిక నైపుణ్యం మంచు లక్ష్మి ఫౌండేషన్ బోధిస్తున్నదన్నారు. మంచికి ప్రతిరూపంగా పేదలకు చదువు చెప్పిస్తున్నారన్నారు. మంచు లక్ష్మి ఫౌండేషన్ ములుగు వంటి మారుమూల ప్రాంతాలకు వచ్చి వారి సేవలను విస్తరించాలని మంత్రి సీతక్క సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





