హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన సెలక్షన్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శనివారం సాయంత్రం విడుదల చేసింది. గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని వివిధ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గత ఏడాది చివరలో బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో గైనకాలజీ, అనస్తేషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ స్పెషాలిటీలకు సంబంధించిన 174 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవడంతో ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను శనివారం విడుదల చేసింది. వీరికి ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నియామక పత్రాలు అందజేయనున్నారు. మిగిలిన 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను మరో నెల రోజుల్లో పూర్తి చేయనున్నారు.
పోస్టుల వివరాలు: గైనకాలజీ 90 పోస్టులు, అనస్తేషియా 44 పోస్టులు, పీడియాట్రిక్స్ 28 పోస్టులు, ఆర్థోపెడిక్స్ 12 పోస్టులు (మొత్తం-174)
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు సహా అన్నిరకాల పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. గs రెండున్నల్లో సుమారు 9572 పోస్టులను భర్తీ చేసింది. మరో 7562 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగా, అందులో 174 పోస్టుల భర్తీ ప్రక్రియ నేటితో ముగిసింది. మరో 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లతోపాటు ఈ 692 పోస్టులకు ఎంపికైన డాక్టర్లకు కూడా ఈ నెల 7న మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించే అవకాశం ఉంది. అలాగే మరో వారంలో 2312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలను కూడా విడుదల చేస్తామని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



