మున్సిపల్ పోలింగ్ వేళ మద్యం దుకాణాల బంద్

హైదరాబాద్,ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 9: ఈనెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనున్న సందర్భంగా మున్సిపాలిటీల పరిధిలో రెండు రోజులపాటు వైన్స్, మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. సోమవారం సాయంత్రం 5 నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఎన్నికల, ఆబ్కారీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 13వ తేదీ వరకు ఫలితాల నేపథ్యంలో వైన్స్, బార్లు మూసివేయనున్నారు. మరోవైపు సోమవారంతో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సాయంత్రానికి మైకులు మూగబోయాయి. గతానికి భిన్నంగా ఈసారి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో రంగంలోకి దిగిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల నేతలు ఒకరిపై మరొకరు పైచేయి సాధించాలన్న పట్టుదలతో తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలతోపాటు ఆయా పార్టీల నుంచి రెబల్స్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్దులు ప్రచారంలో మునిగి తేలారు. ర్యాలీలు, డప్ప్పు చప్ప్పుళ్లు, డీజే పాటల మోతలతో ప్రచారాన్ని హోరెత్తించారు. చివరి రోజు నేతలు సుడిగాలి పర్యటనల” చేశారు.

11న మున్సిపాలిటీల పరిధిలో సెలవు

మున్సిపల్ ఎన్నికలు జరిగే కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు ఈ నెల 11న స్థానిక సెలవు దినంగా ప్రకటిస్తూ ఎన్నికల సంఘం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే లింగ్ కోసం వినియోగిస్తున్న విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలు, ఇతర భవనాల్లోని ఆయా సంస్థలకు 10, 11న స్థానిక సెలవు దినంగా ప్రకటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *